Tamannaah Bhatia: చిక్కుల్లో తమన్నా.! టోకెన్‌ యాప్‌ మనీ లాండరింగ్‌ కేసులో తమన్నా..

|

Oct 20, 2024 | 11:06 AM

సినీ నటి తమన్నాను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ప్రశ్నించారు. బిట్‌కాయిన్లు, ఇతర క్రిప్టోకరెన్సీలను సంపాదించవచ్చన గతంలో ఓ యాడ్ చేశారు. హెచ్‌పీజెడ్‌ టోకెన్‌ యాప్‌లో ఆమె చేసిన ప్రకటనకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో తమన్నాను ప్రశ్నించారు. యాప్‌కు సంబంధించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నందుకే తమన్నాను ప్రశ్నించారని, ఆమెపై ఎలాంటి కేసూ నమోదు కాలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.

యాప్‌ ద్వారా మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న కేసులో ఇప్పటిదాకా 299 సంస్థలను నిందితుల జాబితాలో చేర్చారు. వీటిలో 76 సంస్థలు చైనా అధీనంలో నడుస్తున్నాయి. వాటిలో పది మంది డైరెక్టర్లు చైనా జాతీయులు కాగా రెండు సంస్థలను వేరే దేశాల వాళ్లు నడిపిస్తున్నారు. బిట్‌కాయిన్లు, క్రిప్టో కరెన్సీల మైనింగ్‌ ద్వారా ఊహించని లాభాలు గడించవచ్చని ఆశపెట్టి కోట్లు దండుకున్నారని.. సదరు యాప్‌పై కోహిమా పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ అధికారులు కేసు ఫైల్ చేశారు. ఆన్‌లైన్‌ గేమింగ్, బెట్టింగ్, బిట్‌కాయిన్‌ మైనింగ్‌ కోసం పెట్టుబడులు పెడితే భారీ లాభాలు కళ్లజూస్తారని ప్రచారం చేయడంతో ఎంతో మంది పెట్టుబడులు పెట్టారు. రూ.57 వేల పెట్టుబడికి మూడు నెలల పాటు ప్రతిరోజూ రూ.4,000 ఇస్తామని చెప్పి కేవలం ఒకే ఒక్కసారి ఇచ్చి మానేశారని బాధితులు ఆరోపించారు. దీంతో దేశవ్యాప్తంగా సోదాలు చేపట్టిన ఈడీ ఏకంగా రూ.455 కోట్ల విలువైన స్థిర,చరాస్థులను జప్తు చేసింది. అసలు.. డైరెక్టర్లు లేకపోయినా డొల్ల కంపెనీలను సృష్టించి వాటి పేరు మీద బ్యాంక్‌ ఖాతాలు, మర్చెంట్‌ ఐడీలు తీసుకున్నారని తేల్చింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on