Tollywood Drugs Case Video: డ్రగ్స్‌ కేసులో తనీశ్‌ చిక్కేనా..? టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కొత్త మలుపు(వీడియో)…

Updated on: Sep 21, 2021 | 9:28 PM

సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం కల్లోలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే ఈడీ అధికారుల ముందుకు టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్, రకుల్ ప్రీత్ సింగ్, ఛార్మి, రవితేజ, రానా, నందు, ముమైత్ ఖాన్ ఉన్నారు.

సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం కల్లోలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే ఈడీ అధికారుల ముందుకు టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్, రకుల్ ప్రీత్ సింగ్, ఛార్మి, రవితేజ, రానా, నందు, ముమైత్ ఖాన్ ఉన్నారు. ఇక టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ ఎంక్వైరీ తుది అంకానికి చేరుకుంది. సమన్లు అందుకున్న 12మందిలో హీరో తనీష్ కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా హీరో తనీశ్‌ను విచారించింది ఈడీ.

అయితే విచారణకు వచ్చే సమయంలో బ్యాంక్ అకౌంట్‌లను వెంట తీసుకురావాలని సమన్లు‌లో పేర్కొన్న ఈడీ అధికారులు…. తనీశ్‌ తీసుకొచ్చిన ఆ అకౌంట్లను క్షుణ్నంగా తనిఖీ చేశారు. ప్రధానంగా ఆర్ధిక లావాదేవీలు, డ్రగ్ డీల్స్‌లో తనీశ్‌ పాత్రపైనా ప్రశ్నల వర్షం కురిపించారు.ఇక గతంలోనూ ఈడీ విచారణ ఎదుర్కొన్నారు తనీశ్. అయితే 2017లోనే కేసు ముగిసినా.. మళ్లీ నోటీసులు ఇవ్వడం ఆవేదన కలిగించిందన్నారు తనీశ్. డ్రగ్స్‌లో పట్టుబడిన కెల్విన్‌తో తనకు ఎలాంటి పరిచయం లేదన్నారాయన.

ఇప్పటికే రోజుకి ఒక‌రిని కార్యాల‌యానికి పిలిచి ఈడీ అధికారులు ప్ర‌శ్నిస్తున్నారు. కెల్విన్‌తో తనీష్‌కు గతంలో పరిచయం ఉందా..? ఎప్పుడు కలిశారు..? అలాగే డ్ర‌గ్స్‌కు సంబంధించిన లావాదేవీలు ఏ విధంగా జ‌రిగాయ‌న్న విష‌యంపై అధికారులు విచారించారు. అలాగే, డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రాదారుల‌తో ఆయ‌న‌కు ఉన్న సంబంధాలు, అత‌డితో జ‌రిపిన సంప్ర‌దింపుల‌పై కూడా అధికారులు ఆరా తీశారు. ఇకఈ నెల 22న చివరగా తరుణ్ ను ప్రశ్నించబోతున్నారు ఈడీ అధికారులు.
మరిన్ని చదవండి ఇక్కడ : Prabhas, Rajamouli Video: బాహుబలి రిపీట్… ప్రభాస్‌, రాజమౌళి కాంబోలో మరో సినిమా.. (వీడియో)

 Ek Number News Live Video: చచ్చిపోయిన రోజే మళ్ళా పుట్టిన కవలలు | కండ్ల నీళ్లు పెట్టుకున్న సోనూసూద్‌.(వీడియో)

 Big News Big Debate Live Video: వైట్‌ ఛాలెంజ్‌లు.. రాజకీయ మంటలు… (లైవ్ వీడియో)

 Singer Mangli Interview Full Video: శేఖర్ సార్ చాలా కూల్.. నచ్చాడు.. సింగర్ మంగ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు..(వీడియో)