Ajith Kumar: స్టార్ హీరో రేసింగ్ వెబ్ సైట్ అసలు విషయం.. తెలిసి ఫీలైన ఫ్యాన్స్.!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం కారు రేసింగ్ కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అజిత్ పేరుతో రేసింగ్‌కు సంబంధించిన వెబ్‌సైట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన వివరాలను చెబుతూ అసలు విషయాన్ని బయటపెట్టాడు అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర. ఇప్పుడు అతడి ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది.
అజిత్ కుమార్ రేసింగ్ పేరుతో ఈహీరో సొంతంగా ఓ టీమ్ నడుపుతున్నారు. జట్టుకు అధికారిక డ్రైవర్‌గా ఫాబియన్ డఫీక్స్‌విల్‌ను ప్రకటించారు. అజిత్ 2004లో ఎఫ్3 కార్ రేస్‌లో, 2010లో ఫార్ములా 2 కార్ రేస్‌లో పాల్గొన్నాడు. ఇటీవల నెదర్లాండ్స్‌కు చెందిన రేస్ ప్లేయర్‌ల కోసం దుస్తులను తయారు చేసే కంపెనీ అధికారులతో అజిత్ కుమార్ సంప్రదింపులు జరుపుతున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఇక జీటీ 3 కప్‌లో పాల్గొనబోతున్న అజిత్ కుమార్ ప్రాక్టీస్ వీడియో విడుదలై అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చింది. ఇందులో అజిత్ కుమార్ పేరు మీద ఉన్న వెబ్‌సైట్.. www.ajithkumarracing.com నెట్టింట తెగ వైరలవుతుంది. అయితే ఈ వెబ్ సైట్ అధికారికంగా అజిత్ దేనా.. లేక మరెవరైనా క్రియేట్ చేశారా ? అనే డౌట్ ఫ్యాన్స్‌లో ఉంది
ఇక ఈక్రమంలోనే అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర ఈ వెబ్ సైట్ పై క్లారిటీ ఇచ్చాడు. ఈ వెబ్ సైట్ అధికారికంగా క్రియేట్ చేయలేదని..అసలు అజిత్ పేరుతో ఎలాంటి వెబ్ సైట్స్ రెడీ చేయలేదని.. తన ట్వీట్లో రాసుకొచ్చాడు. తమ హీరోకు సంబంధించిన విషయాలు పూర్తిగా అధికారిక ఖాతాల ద్వారా మాత్రమే పోస్ట్ చేయబడతాయన్నాడు. దీంతో ఇప్పటి వరకు ఈ వెబ్ సైట్ ఇప్పటి వరకు అజిత్‌దే అని సంబర పడుతున్న ఫ్యాన్స్ కాస్త ఫీలవుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.