‘బలుపు, యాటిట్యూడ్‌ తనే కాదు.. నువ్వూ కూడా తగ్గించుకోవాలమ్మా

Updated on: Oct 28, 2025 | 6:59 PM

బిగ్ బాస్‌ నుంచి రీసెంట్‌గా ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన రమ్య మోక్ష ఏమో కానీ.. ఆమెను ఎలిమినేషన్‌ను కాస్త అతిగా వివరించిన గీతూ రాయల్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. ట్రోల్ కూడా అవుతున్నారు. ఇక ఆదితో పాటే బిగ్ బాస్‌ షోలపై రివ్యూలిస్తూ నాలుగు రూపాయలు వెనకేయాలనే ఎయిమ్‌తో పలు వీడియోలు.. అండ్ షార్ట్స్‌ చేస్తున్న గీతూ రాయల్‌

బిగ్ బాస్‌ నుంచి రీసెంట్‌గా ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన రమ్య మోక్ష ఏమో కానీ.. ఆమెను ఎలిమినేషన్‌ను కాస్త అతిగా వివరించిన గీతూ రాయల్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. ట్రోల్ కూడా అవుతున్నారు. ఇక ఆదితో పాటే బిగ్ బాస్‌ షోలపై రివ్యూలిస్తూ నాలుగు రూపాయలు వెనకేయాలనే ఎయిమ్‌తో పలు వీడియోలు.. అండ్ షార్ట్స్‌ చేస్తున్న గీతూ రాయల్‌… రీసెంట్‌ గా హౌస్‌ నుంచి బయటికి వచ్చిన రమ్య మోక్షన్ పై షాకింగ్ కామెంట్స్‌ చేస్తూ ఓ వీడియోను పోస్ట్ చేసింది తన సోషల్ మీడియా హ్యాండిల్లో…! అయితే ఈ వీడియోలో… రమ్య మోక్ష హస్‌లో ఎలా ప్రవర్తించిందో తన స్టైల్లో వివరించింది. తన కోపమే తన శత్రువు, తన బలుపే తన శత్రువు, తన పొగరే తన శత్రువు, తన మాటలే తన శత్రువు.. ఇన్ని శత్రువులు ఉన్నాయి కనుకే రమ్య కొన్ని రోజులకే హౌస్‌ నుంచి ఎలిమినేట్ అయిందంటూ గీతూ చెప్పుకొచ్చింది. రమ్య హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి రోజే.. శ్రీజ మాకు పచ్చళ్ళు వస్తున్నాయా అని రమ్యను అడిగితే.. హా వస్తాయిలే కంగారుపడకంటూ ఆమె యాటిట్యూడ్ చూపించిందని.. అప్పటి నుంచే హౌస్‌లో తన జర్నీ ఎలా ఉంటుందో తెలిసిపోయిందంటూ తన వీడియోలో చెప్పుకొచ్చింది. అంతేకాదు హౌస్ లో అప్పటికే ఉన్న బాండ్స్ బ్రేక్ అవ్వడానికి రమ్యనే కారణం అంటూ గీతూ చెప్పుకొచ్చింది. వచ్చీ రాగానే కళ్యాణ్, తనూజ బాండ్ బ్రేక్ చేసింది. డిమాన్ దగ్గరకు వెళ్లి రీతూ గురించి చాడీలు చెప్పింది. భరణి దగ్గరకెళ్లి బాండ్స్ పెట్టుకోవడం వల్లే మీ ఆట ఇలా అయ్యింది అంటూ వాపోయింది. వాళ్లందరి ఆటతీరును రమ్య డిస్ట్రబ్‌ చేసిందంటూ గీతూ చెప్పుకొచ్చింది. రమ్య టాస్క్‌లు కూడా బాగా ఆడలేదని.. నామినేషన్స్ లో ఉన్నా కూడా పోయిన వారం తన పర్ఫామెన్స్ సున్నా అంటూ తన వీడియోలో గీతూ చెప్పుకొచ్చింది. పోనీ మాటలతో అన్నా అందర్నీ ఆకట్టకుందా అంటే అదీ లేదు. అన్నీ బలుపు మాటలు.. పొగరు మాటలతో.. హౌస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌కు ఎయిమ్‌ అయింది ఇప్పుడు నేరుగా బయటికి వచ్చేసిందంటూ గీతూ రాయల్ తన వీడియోలో చెప్పుకొచ్చింది. అయితే ఇలా రమ్య ఎలిమినేష్‌ గురించి వివరిస్తూ.. గీతూ రాయల్ కూడా కాస్త అతిగా మాట్లాడిందని.. తను కూడా కాస్త మాటలు తగ్గించుకుంటే బెటర్‌ అని..బలుపు మాటలు తనవి కాదు.. గీతూవే అనే కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో కొందరు నెటిజన్ల నుంచి వస్తోంది. రమ్య ఎలిమినేషన్ మీద చేసిన వీడియో..అందులోని మాటల కారణంగా ఇప్పుడు గీతూ ట్రోలర్స్‌కు మంచి ఫీడ్ లా కూడా మారింది. తన మాటలతో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: దిమ్మతిరిగే బిజినెస్‌..అప్పుడే లాభాల్లో చిరు సినిమా

Kantara Chapter 1 OTT: దిమ్మతిరిగే న్యూస్.. OTTలోకి కాంతార చాప్టర్ 1

కింగ్ కోబ్రా తిరగబడితే ఎలా ఉంటుందో తెలుసా.. చూస్తే గుండె గల్లంతే

పశువులకోసం గడ్డి కోస్తున్న యువతి.. ఊహించని విధంగా

పంటపొలాల్లో చేపల సందడి.. సంచులతో ఎగబడ్డ జనం