చిరంజీవిపై గరికపాటి సీరియస్‌.. ప్రభాస్‌కు మంత్రి వార్నింగ్(Video)

|

Oct 07, 2022 | 9:19 AM

వెల్‌ కమ్ టూ టాప్ 9 ఈటీ.. నవంబర్ 6th టాప్ 9 న్యూస్ ఏంటో ఇప్పుడు క్విక్‌ గా చూసేద్దాం..

వెల్‌ కమ్ టూ టాప్ 9 ఈటీ.. నవంబర్ 6th టాప్ 9 న్యూస్ ఏంటో ఇప్పుడు క్విక్‌ గా చూసేద్దాం. ఆదిపురుష్ సినిమాని వివాదాలు చుట్టుముడుతున్నాయి. రామాయణాన్ని పక్కదోవ పట్టించేలా సినిమా ఉందనే విమర్శలు ఎక్కువవుతున్నాయి. రామాయణాన్ని, అందులోని క్యారెక్టర్లని మేకర్స్ వక్రీకరించారనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే ఈ సినిమా మేకర్స్ కు మధ్య ప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా వార్నింగ్ ఇచ్చారు. టీజర్‌ లోని కొన్ని సన్నివేశాలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే తొలగించాలని, లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.

అలాగే.. తన ప్రవచనాలతో.. ప్రవచనాల మధ్యలో వేసే చమత్కారాలతో.. విమర్శలతో వి విపరీతంగా పాపులర్ అయిన గరికపాటి.. ఉన్నట్టుండి దత్తన్న అలయ్‌ బలయ్‌ కార్యక్రమంలో సీరియస్ అయ్యారు. అది కూడా మెగాస్టార్ చిరంజీవి పైనే గరం గరం అయ్యారు. ఇలా అయితే నేను వెళ్లిపోతా అంటూ.. హెచ్చరించారు. ఆయన మాట్లాడుతుంటే.. చిరు అభిమానులతో ఫోటో దిగడం వల్లే.. ఆయన ఇలా రియాక్టయ్యారు. అయితే చిరు వెంటనే గరికపాటి దగ్గరకు వచ్చి.. ఆయన్ను కూల్ చేశారు. ఆయన మాట్లాడే వరకు పక్కనే కూర్చున్నారు. ఇంకా మరిన్ని విశేషాల కోసం ఈ వీడియో చూసేయండి..

Published on: Oct 07, 2022 09:19 AM