సల్మాన్ ఖాన్ సినిమా బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ పై చైనా అభ్యంతరం
సల్మాన్ ఖాన్ నటించిన బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ సినిమాపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. 2020 గల్వాన్ ఘర్షణల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం, కల్నల్ సంతోష్ బాబు పాత్రలో సల్మాన్ ఖాన్ నటిస్తుండగా, దీని టీజర్ విడుదలైంది. సినిమా వల్ల చరిత్ర మారదని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. సల్మాన్ ఖాన్ నటించిన బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ సినిమాపై డ్రాగన్ కంట్రీ చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
సల్మాన్ ఖాన్ నటించిన బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ సినిమాపై డ్రాగన్ కంట్రీ చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రం 2020లో గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణల ఆధారంగా తెరకెక్కుతోంది. చైనా ప్రాదేశిక సమగ్రతను దెబ్బతీయలేరని గ్లోబల్ టైమ్స్ లో కథనం ప్రచురించింది. గల్వాన్ ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ వాసి కల్నల్ సంతోష్ బాబు పాత్రలో సల్మాన్ ఖాన్ నటిస్తున్నారు. 2020 నాటి ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు, చైనా వైపు కూడా గణనీయమైన ప్రాణనష్టం జరిగిందని భారత్ పేర్కొన్నప్పటికీ, చైనా అధికారికంగా ధ్రువీకరించలేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. హైదరాబాద్ సీపీ సజ్జనార్ వార్నింగ్
కొత్త ఏడాదికి పాత సినిమాలతో వెల్ కమ్
75 దాటిన తర్వాత రజినీ ప్లాన్ మారిపోయిందా
