Gaddar Film Awards: గద్దర్ అవార్డులపై ప్రభుత్వం ప్రకటన

Edited By:

Updated on: Jan 22, 2026 | 4:17 PM

తెలంగాణ ప్రభుత్వం 2025 గద్దర్ ఫిల్మ్ అవార్డుల నిర్వహణకు ప్రకటన జారీ చేసింది. ఈసారి 17 విభాగాల్లో అవార్డులు అందజేయనున్నారు, ఇందులో ఉత్తమ సామాజిక సందేశ చిత్రం, డా. సినారే ప్రత్యేక అవార్డులు ఉన్నాయి. దరఖాస్తు పత్రాలు 2026 జనవరి 31 వరకు, ఎంట్రీలు ఫిబ్రవరి 3, 2026 వరకు స్వీకరించబడతాయి. పూర్తి వివరాలు త్వరలో ప్రకటించబడతాయి.

తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డుల ప్రకటన చేసింది.. గతేడాది ఒకేసారి పదేళ్లకు గానూ విజయవంతంగా అవార్డులు ప్రకటించి సంచలనం సృష్టించిన సర్కార్.. 2025 ఏడాదికి గానూ అవార్డుల నిర్వహణకు అధికారికంగా ప్రకటన జారీ చేసింది. మరి ఈ సారి అవార్డుల రేసులో ఉన్న ఆ సినిమాలేంటి..? గద్దర్ అవార్డుల డీటైల్స్ ఏంటో చూద్దామా..? గతేడాది 2014 నుంచి 2023 వరకు పదేళ్ళ అవార్డులను ఒకేసారి ప్రధానం చేసింది తెలంగాణ సర్కార్. ఈ అవార్డ్స్ 2025 నిర్వహణకు తాజాగా అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ద్వారా సర్టిఫికేషన్ పొందిన చిత్రాలకు ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానం చేయనున్నట్లు రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటివరకు ఉన్న విభాగాలకు తోడు ఈ సారి 17 విభాగాల్లో అవార్డులు ఇవ్వబోతున్నారు. సామాజిక స్పృహను ప్రతిబింబించే చిత్రాలకు ఉత్తమ సామాజిక సందేశ చిత్రం అవార్డు, ప్రత్యేక విభాగంలో డా. సినారే అవార్డులను అందజేయనున్నామన్నారు. గతేడాది కోర్ట్, అనగనగా సహా చాలా మంచి మంచి సినిమాలు వచ్చాయి. అర్హులైన నిర్మాతలు, ఇతర దరఖాస్తుదారులు అవార్డులకు సంబంధించిన దరఖాస్తు పత్రాలు, మార్గదర్శకాలను జనవరి 31, 2026 వరకు పొందవచ్చని.. ఎంట్రీల సమర్పణకు ఫిబ్రవరి 3, 2026 చివరి తేదీగా నిర్ణయించినట్లు తెలిపారు. త్వరలోనే అవార్డు తేదీని ప్రకటిస్తామని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫ్యామిలీ బొమ్మ తియ్.. బాక్సాఫీస్‌పై దండయాత్ర చేయ్..

ఒక్క సినిమాతో.. చేజారిన నెంబర్ వన్ పీఠంపై కన్నేసిన బాలీవుడ్

ప్యారడైజ్ Vs పెద్ది.. ఈ ట్విస్ట్ ఊహించలేదుగా

మాకు మేమే.. మాతో మేమే అంటున్న కుర్ర హీరోలు

రూ. 6 వేల నుంచి రూ.10 వేలు !! బడ్జెట్‌లో రైతులకు సాయం పెరగనుందా ??