ఇదెక్కడి మాస్ నాయనా.. రచ్చ చేస్తున్న యంగ్ హీరోలు వీడియో

Updated on: Dec 25, 2025 | 12:27 PM

క్లాస్ సినిమాలు చేసినా, మాస్ అంటే హీరోలకు ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి. నాని ప్యారడైజ్తో, విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధనతో, సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టుతో మాస్ గెటప్‌లలోకి మారారు. హైదరాబాద్ పాతబస్తీ, గోదావరి జిల్లాలు, సీమ నేపథ్యంలో సాగే రౌడీయిజం కథలతో యువతరం కథానాయకులు రచ్చ చేస్తున్నారు.

ఎన్ని క్లాస్ లేదా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లు చేసినా, మాస్ జోనర్ అంటే యువ కథానాయకులకు ఎప్పుడూ ఒక ప్రత్యేక ఆకర్షణ. ఈ జాబితాలో స్టార్ హీరోలతో పాటు మీడియం రేంజ్ హీరోలు సైతం ఒకరిని మించి ఒకరు మాస్ అవతారాలు ఎత్తుతున్నారు. ఈ పదంపై ఉన్న మ్యాజిక్ కారణంగానే మన హీరోలు పదే పదే ఈ వైపు మొగ్గు చూపుతున్నారు.
తాజాగా, విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన టీజర్‌తో మాస్ అవతారంలో కనిపించారు. ఈ చిత్రంలో విజయ్ గోదావరి జిల్లాల రౌడీయిజంను ప్రదర్శిస్తున్నారు. ఇదే సమయంలో, నాని ప్యారడైజ్ చిత్రంతో హైదరాబాద్ పాతబస్తీ నేపథ్యంలోని పీరియడ్ రౌడీయిజంను శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చూపిస్తున్నారు. ఈ రెండు చిత్రాలలోనూ కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం :

స్టార్ హీరోలు కూడా భయపడుతుంటే.. కాజల్‌ ఒక్కతే ధైర్యంగా కామెంట్ చేసింది వీడియో

చడీచప్పుడు కాకుండా కూతురి పెళ్లి చేసిన జగపతి బాబు వీడియో

భారీగా ఆశ చూపినా.. బిగ్ బాస్‌కు నో చెప్పిన రిషి సార్ వీడియో