ప్రొడ్యూసర్లుగా మారుతున్న స్టార్ హీరోయిన్లు వీడియో
అగ్రతారలు నిర్మాతలుగా మారుతూ సినీ పరిశ్రమలో కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. ప్రియాంక చోప్రా, కృతి సనన్, ఆలియా భట్, నయనతార, సమంత వంటి హీరోయిన్లు కొత్త దర్శకులకు, విభిన్న కథలకు అవకాశం కల్పిస్తున్నారు. నటిగా, నిర్మాతగా ద్విపాత్రాభినయం సవాలుతో కూడుకున్నదైనా, ఇష్టంతోనే ఈ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారని వారు వెల్లడిస్తున్నారు.
సినిమా పరిశ్రమలో నటీమణులు కేవలం తెరపై కనిపించడానికే పరిమితం కావడం లేదు. స్టార్ హీరోయిన్లు తమ సొంత ప్రొడక్షన్ హౌస్‌లను స్థాపించి నిర్మాతలుగా కొత్త ప్రయాణాన్ని మొదలుపెడుతున్నారు. ఈ జాబితాలో ప్రియాంక చోప్రా ముందున్నారు. ఆమె తన నిర్మాణ సంస్థ ద్వారా కొత్త దర్శకులకు, విభిన్న కథలకు అవకాశాలు కల్పిస్తానని చెబుతున్నారు. నయా దర్శకుల్లో క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుందని, వారి కలలకు ప్రాణం పోయడమే తన లక్ష్యమని ప్రియాంక పేర్కొన్నారు. నటిగా, నిర్మాతగా రెండు పడవల ప్రయాణం కష్టమని, అయినప్పటికీ ఇష్టంగా ఈ బాధ్యతలను నిర్వర్తిస్తున్నానని ఆమె తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం :
