మంగ్లీని పచ్చి బూతులు తిడుతూ వీడియో.. దెబ్బకు జైల్లో పెట్టించిన సింగర్

Updated on: Nov 29, 2025 | 10:54 AM

ప్రముఖ గాయని మంగ్లీ తన పాట, వర్గంపై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై ఎస్.ఆర్. నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 'బాయిలోనే బల్లి పలికే' పాటపై అభ్యంతరకర పోస్టులు పెట్టిన ఇన్‌ఫ్లూయెన్సర్‌ను పోలీసులు తక్షణమే అరెస్ట్ చేశారు. సైబర్ నేరాలపై మంగ్లీ చర్య సోషల్ మీడియా దుర్వినియోగదారులకు గట్టి హెచ్చరిక.

ప్రముఖ జానపద గాయని మంగ్లీ.. సైబర్ నేరగాళ్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పాటను ఉద్దేశిస్తూ, అలాగే తన వర్గాన్ని కించపరుస్తూ సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్స్ చేసిన ఓ వ్యక్తిపై ఆమె ఎస్.ఆర్. నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఇటీవల విడుదలైన “బాయిలోనే బల్లి పలికే…” సాంగ్ యాట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈక్రమంలోనే ఓ వ్యక్తి ఇన్‌స్టాలో ఈ పాటను.. ఈ పాట పాడిన మంగ్లీని ఉద్దేశిస్తూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే యాక్షన్లోకి దిగిన పోలీసుల.. సదరు ఇన్‌స్టా ఇన్‌ఫ్లూయన్సర్‌ను అరెస్ట్ చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Hema Chandra: విడాకుల పై ప్రశ్నించినందుకు.. యాంకర్‌కు ఇచ్చిపడేసిన సింగర్ హేమచంద్ర

Cyclone Ditwah: దూసుకొస్తున్న ‘దిట్వా’.. టార్గెట్‌ ఏపీ, తమిళనాడు

Bigg Boss Telugu 9: డేంజర్‌ జోన్ లో.. సుమన్ శెట్టి