పైరసీపై ఉక్కుపాదం.. స్ట్రాంగ్ వార్నింగ్..!

Updated on: Oct 02, 2025 | 4:51 PM

టాలీవుడ్‌ను మాత్రమే కాదు.. అన్ని ఉడ్లను వణికించే పదం పైరసీ. ఈ మాట వింటేనే నిర్మాతలకు నిద్ర పట్టదు.. హీరోలకు కంటి మీద కునుకు రాదు. ఇలాంటి పైరసీపై యుద్ధం మొదలైందిప్పుడు. ఆపరేషన్ ఐ బొమ్మతో పాటు.. అన్ని పైరసీ సైట్లకు బొమ్మ చూపిస్తాం అంటున్నారు పోలీసులు. దీనిపై టాలీవుడ్ కూడా ఏకమవుతుంది.

తెలుగు ఇండస్ట్రీని కాదు.. మొత్తం సినిమా ఇండస్ట్రీని పైరసీ ఏ స్థాయిలో ముంచేస్తుందో చెప్పనక్కర్లేదు. వందల కోట్లలో నష్టాలు చూస్తుంది ఈ పైరసీ వల్ల సినిమా ఇండస్ట్రీ. దీనిపై ఎన్ని చర్యలు తీసుకున్నా పుట్ట గొడుగులా పుట్టుకొస్తూనే ఉన్నాయి సైట్లు. అయితే దీనిపై యుద్ధం మొదలైంది.. పోలీసులు కూడా ఈ పైరసీ అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. మూవీ రూల్జ్, ఐ బొమ్మ.. ఇలా పైరసీకి సంబంధించి ప్రధానంగా వినిపించే వెబ్ సైట్స్ నిర్వహించే ఓ ముఠాను హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను గతంలోనే టాలీవుడ్ సినీ పెద్దలకు పోలీసులు వివరించారు. తాజాగా దిల్ రాజు సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. గతంలో జరిగిన సమవేశంలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, నాని, రామ్, నాగచైతన్య సహా చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో విడుదలకు ముందే హెచ్‌డీ ప్రింట్లు ఎలా బయటకు వస్తున్నాయో దర్శక నిర్మాతలు, హీరోలకు వివరించారు పోలీసులు. మరి ఈ చొరవతో పైరసీ కంట్రోల్ అవుతుందా లేదా చూడాలిక.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బీసీసీఐ ముందు తలవంచిన పీసీబీ చీఫ్

అమెరికా సెనెట్ లో ఇమిగ్రేషన్ సంస్కరణల బిల్లు

ఆందోళనకారులపై పాక్ సాయుధ బలగాల కాల్పులు

Ranbir Kapoor: ప్రయోగానికి రెడీ అవుతున్న రణబీర్‌ కపూర్‌

Spirit: కరీనా ప్లేస్‌లో మలయాళ బ్యూటీకి ఛాన్స్