ఏడాది ఆదాయం 3 రూపాయలే.. దేశంలోనే నిరుపేద వ్యక్తి ఇతడే

Updated on: Aug 02, 2025 | 10:30 AM

పేదరికాన్ని లెక్కించటానికి అనేక పద్ధతులు ఉన్నాయి. వాటిలో దారిద్ర్య రేఖ అనేది ఒకటి. సాధారణంగా మన ప్రభుత్వాలు దీని ఆధారంగానే పేదరికాన్ని లెక్కిస్తుంటాయి. అయితే, ఆ పేదల జాబితాలోని చిట్టచివరి మనిషి ఎవరనేది మాత్రం తేల్చే పనికి ఎప్పుడూ పూనుకోలేదు. అయితే.. రాం స్వరూప్ అనే వ్యక్తే.. మనదేశంలో కడుపేద అని చెప్పే ఒక వార్త వెలుగులోకి వచ్చింది.

మధ్యప్రదేశ్ లోని టీకమ్ ఘడ్ జిల్లాలోని నయాగావ్ గ్రామానికి చెందిన 45 ఏళ్ల రైతు రాం స్వరూప్.. ఆదాయం సర్టిఫికెట్ కావాలంటూ రెవెన్యూ ఆఫీసర్ వద్దకు వెళ్లాడు. జూలై 22 వ తేదీన తహసీల్దార్ సౌరభ్ ద్వివేది రామ్ స్వరూప్ ఆదాయం కేవలం 3 రూపాయాలే.. అంటూ ఆదాయపు సర్టిఫికెట్ ఇచ్చేశాడు. అయితే, ఎవరి పుణ్యానో తెలీదు గానీ.. ఆ సర్టిఫికెట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో.. ఒక్కసారిగా రాం స్వరూప్, అతనికిచ్చిన సర్టిఫికెట్ ముచ్చట ప్రధాన వార్తల్లోకి ఎక్కేసింది. దీంతో.. నెటిజన్లు … రాం స్వరూప్‌ను దేశంలోనే అత్యంత పేదవాడిగా సర్టిఫై చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో అటు రెవన్యూ అధికారులు సైతం.. రాం స్వరూప్ ఎవరు? ఏం చేస్తుంటారు? అసలు ఆ సర్టిఫికెట్ నిజమైనదేనా? అనే ఎంక్వయిరీలు మొదలు పెట్టారట. అయితే.. విచారణలో రెవెన్యూ అధికారుల అనుమానం నిజమైంది. సర్టిఫికెట్ టైప్ చేసే సమయంలో జరిగిన 30,000 రూపాయలకు బదులు రూ. 3 అని పడిందని వారు నిర్ధారించారు. అయితే, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా కూడా రెవెన్యూ అధికారులు చేసిన తప్పు దేశవ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్ గా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Kingdom: కింగ్డమ్‌కు అదిరిపోయే కలెక్షన్స్‌.. వెంకన్న సాక్షిగా కొట్టిపడేసిన కొండన్న!

Chethabadi: వణికిస్తున్న చేతబడి మోషన్ పోస్టర్‌.. ఏంట్రా బాబోయ్ ఇలా ఉంది