Don 3: డాన్‌ -3 విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చిన మేకర్స్

Updated on: Jan 21, 2026 | 4:53 PM

డాన్ 3 ప్రాజెక్ట్ గురించి వస్తున్న పుకార్లకు చిత్రబృందం తెరదించింది. రణ్‌వీర్ సింగ్ తప్పుకున్నారన్న వార్తలను ఖండిస్తూ, సినిమా పక్కాగా ఉంటుందని స్పష్టం చేసింది. దర్శకుడు ఫర్హాన్ అక్తర్ స్క్రిప్ట్ పనుల్లో నిమగ్నమై ఉన్నారని, త్వరలోనే షూటింగ్ ప్రారంభమవుతుందని వెల్లడించింది. షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్‌లు అతిథి పాత్రల్లో కనిపించనున్నారని కూడా మేకర్స్ తెలిపారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో డాన్ 3 సీక్వెల్ గురించి చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన ముందే వెలువడినప్పటికీ, ఆ తర్వాత ఎటువంటి అప్‌డేట్ లేకపోవడంతో సినిమా ఆగిపోయిందనే ప్రచారం మొదలైంది. రణ్‌వీర్ సింగ్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని, అతని స్థానంలో హృతిక్ రోషన్ నటించబోతున్నారని వదంతులు వ్యాపించాయి. షారుఖ్ ఖాన్ అతిథి పాత్రలో నటించడానికి దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించాలనే షరతు పెట్టారని కూడా వార్తలు వచ్చాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Karthi: అభిమానులకు షాక్ ఇచ్చిన కార్తి.. ఖైదీ 2 ఉన్నట్లా.. లేనట్లా

Dhanush: మరో వివాదంలో ధనుష్‌.. ఆ సినిమా పై కేసు

తగ్గేదే లే అంటున్న సీనియర్ స్టార్లు.. దూకుడు మాములుగా లేదుగా

Allari Naresh: హీరో నరేష్‌ ఇంట తీవ్ర విషాదం

హృదయవిదారకం.. ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు.. ఏం జరిగిందంటే.. ?