Prabhas Fan Sucide Note: ప్రభాస్‌కి అభిమాని సూసైడ్ నోట్ .. వారే కారణం అంటూ..!(వీడియో)

Anil kumar poka

Anil kumar poka |

Updated on: Nov 20, 2021 | 8:37 AM

ప్రభాస్‌కు ఉన్న ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి సినిమాతో అతని క్రేజ్ దేశాలు, ఖండాలు దాటింది. ప్రభాస్ ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్. అతడు చేసే సినిమాలు కూడా ఆ రేంజ్‌లోనే ఉన్నాయి ఇప్పుడు.


ప్రభాస్‌కు ఉన్న ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి సినిమాతో అతని క్రేజ్ దేశాలు, ఖండాలు దాటింది. ప్రభాస్ ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్. అతడు చేసే సినిమాలు కూడా ఆ రేంజ్‌లోనే ఉన్నాయి ఇప్పుడు. తాజాగా ప్రభాస్‌కి ఓ అభిమాని సూసైడ్ నోట్ పంపండం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే.. ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం రాధే శ్యామ్. వచ్చే ఏడాది జనవరి 14న ఈ సినిమాను రిలీజ్ చేస్తామని మూవీ టీమ్ ప్రకటించింది. అయితే సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ మాత్రం రెగ్యులర్‌గా రావడం లేదు. ప్రభాస్ బర్త్ డేకు టీజర్ వదిలారు. ఆ తర్వాత మరో అప్‌డేట్ లేదు. ఈ విషయంపై ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

తాజాగా తన ఫేవరెట్ స్టార్ ప్రభాస్‌ రాబోయే చిత్రం రాధే శ్యామ్ కు సంబంధించిన అప్‌డేట్‌లను మేకర్స్ విడుదల చేయకపోవడంతో హర్టయిన ప్రభాస్ అభిమాని ఒకరు సూసైడ్ నోట్ రాశాడు. తన ఆత్మహత్యకు యువీ క్రియేషన్స్ టీమ్, దర్శకుడు రాధాకృష్ణ కారణమని ఆరోపిస్తూ ప్రభాస్‌కు సూసైడ్‌ నోట్‌ రాశారు. అంతేకాదు, తన జీవితంలో ఎప్పుడూ లేఖ రాయలేదని, అయితే మొదటిసారిగా సినిమా కోసం సూసైడ్ నోట్ రాస్తున్నానని పేర్కొన్నాడు. ఇప్పటికే ఎంతో వెయిట్ చేశామని.. ఇక ఓపిక లేదంటూ ఆ లేఖలో రాసుకొచ్చారు. నా చావుతో అయినా అప్‌డేట్స్ ఇస్తారని భావిస్తున్నా.. ఫ్యాన్స్ ఎమోషన్‌తో ఆడుకోవద్దు అంటూ లేఖను ముగించారు. ప్రస్తతం ఈ లేఖ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మరి ఈ లెటర్‌పై రాధే శ్యామ్ యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరిన్ని చూడండి ఇక్కడ:

Icon Star Allu Arjun Pushpa: సోషల్ మీడియాలో పుష్పరాజ్ సందడి.. ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ పుష్ప లుక్స్..

jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..

Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu