ఫేక్ రివ్యూ ఎఫెక్ట్ పోలీస్‌ స్టేషన్‌కు పూల చొక్కా…

Updated on: Jul 19, 2025 | 6:04 PM

పుచుక్ పుచుక్‌.. టమాటా చితికింది.!! పూల చొక్కా వాడింది.!! హాయ్‌ గాయ్స్‌ అనే మాట మ్యూటయింది. సినిమా రివ్యూపై బేరసారాల కథ అటుంచితే.. ఇప్పటిదాకా యూట్యూబ్‌లో ఉన్న ఆ కాస్త క్రేజ్‌ ఏమవుతుందో అనే ఆలోచన మొదలైంది. ఇది పోలీస్‌ స్టేషన్‌లోకి వెళ్తున్నప్పుడు పూల చొక్కా నవీన్.. ఎక్స్‌ప్రెషన్స్‌! టమాటాలతో టాలీవుడ్ సినిమాలకు రివ్యూలిస్తూ.. నెట్టింట పాపులర్ అయిన పూల చొక్కా అలియాస్ నవీన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వర్జిన్ బాయ్స్ సినిమాకు పాజిటివ్‌ రివ్యూ ఇచ్చేందుకు డబ్బు డిమాండ్ చేశాడన్న ఆరోపణలతో.. మేకర్స్ పూల చొక్కా నవీన్‌పై పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఈ యూట్యూబర్‌ను స్టేషన్‌కు పిలిచి విచారించారు. రాజా దారపునేని ప్రొడక్షన్లో.. దయానంద్ డైరెక్షన్లో… మిత్ర శర్మ, గీతానంద్, శ్రీహాన్ కీ రోల్స్‌లో తెరకెక్కిన సినిమా వర్జిన్ బాయ్స్‌. జులై 11న రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత ఏర్పాటు చేసిన మీడియా మీట్‌లో ప్రొడ్యూసర్ రాజా దారపునేని రివ్యూవర్ పూలచొక్కా పై సీరియస్ అయ్యాడు. తన సినిమాకు పాజిటివ్ రివ్యూ ఇచ్చేందుకు 40వేలు డిమాండ్ చేశాడని ఆరోపించాడు. అయితే అంత మొత్తం ఇవ్వడం తనకు పెద్ద లెక్క కాదన్న రాజా దారపునేని… ఇలాంటి వారిని తొక్కేయాలంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈక్రమంలోనే పూల చొక్కా నవీన్ పై ఫిల్మ్ నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు వర్జిన్ బాయ్స్ ప్రొడ్యూసర్. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పూల చొక్కా నవీన్‌ను స్టేషన్‌కు పిలిపించి మాట్లాడారు. నవీన్‌ వెర్షన్‌ను రికార్డ్‌ చేసి.. పంపించేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూ. 7 కోట్లతో తీస్తే.. 90 కోట్ల కలెక్షన్స్.. ఛావా రికార్డ్ బ్రేక్

మనిషైనా..జంతువైనా.. ఆ విషయం లో భార్యకు వణకాల్సిందే