‘కమెడియన్స్‌ది ఏ స్థానమో మళ్లీ చూపించారు’ మీకో దండం

Updated on: Dec 24, 2025 | 9:18 AM

బిగ్‌బాస్‌లో కమెడియన్ల ప్రస్థానం, ఇమ్మూ ఎలిమినేషన్‌తో రోహిణి ఆగ్రహం వ్యక్తం చేసింది. ధనరాజ్, అవినాష్, రోహిణి వంటి కమెడియన్లు ఎంతగా ఆడినా టైటిల్ గెలవలేకపోయారు. ఇప్పుడు ఇమ్మూ నిష్క్రమణ బిగ్‌బాస్ టీమ్‌పై విమర్శలకు దారితీసింది. కష్టపడిన ఎంటర్‌టైనర్‌లకు విలువ ఇవ్వడం లేదని రోహిణి ఆవేదన చెందింది.

ధనరాజ్, అవినాష్‌, రోహిణి, ఇలా చాలామంది కమెడియన్స్‌గా గుర్తింపు తెచ్చుకున్న వాళ్లు.. బిగ్‌బాస్‌లో అడుగుపెట్టి ప్రేక్షకులకు నవ్వుల్ని పంచారు. కేవలం కామెడీని నమ్ముకోకుండా ఆటలోనూ తమ సత్తా చాటారు. తగ సీజన్‌లో శివంగి అని నిరూపించింది రోహిణి. ఫస్ట్‌ ఫైనలిస్ట్‌గా నిలిచి తన దమ్ము చూపించాడు ముక్కు అవినాష్‌. కానీ, వీళ్లెవరూ ట్రోఫీని అందుకోవడం కాదుకదా.. కనీసం రన్నరప్‌ కూడా అవలేకపోయారు. ఈసారి మాత్రం ఆ లోటును ఇమ్మాన్యుయేల్‌ తీర్చబోతున్నాడని బలంగా ఫిక్సయ్యారు. కానీ ఇమ్మూ నాలుగో స్థానంలో ఎలిమినేట్‌ అయినట్లు లీక్స్‌ బయటకు వచ్చాయి. అది జీర్ణించుకోలేక ఇమ్మూ స్టేజీపై బోరుమని ఏడ్చాడట.. ఈ విషయంపై కమెడియన్‌ రోహిణి సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడి విషయంలో బిగ్‌బాస్‌ టీమ్‌, ప్రేక్షకులు.. ప్రతి ఒక్కరూ ఫెయిల్‌ అయ్యారు అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పోస్ట్‌ పెట్టింది. బిగ్‌బాస్‌ 9 సీజన్‌ నన్ను చాలా డిసప్పాయింట్‌ చేసింది. కష్టపడినా విలువ ఉండదు, దానికి తగ్గ ఫలితం రాదు. మీ దృష్టిలో ఎంటర్‌టైనర్స్‌కు ఏ స్థానం ఉందో మళ్లీ నిరూపించారు. ఇమ్మూ.. ఈ సీజన్‌కు నిజమైన విజేత నువ్వే.. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది అని రాసుకొచ్చింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Demon Pavan: డీమాన్ పవన్‌కు జాక్‌ పాట్ విన్నర్‌ ప్రైజీ మనీకి సమానంగా నొక్కాడు

మెడికల్ మాఫియాపై ఇంట్రెస్టింగ్ సీరిస్! ‘ఫార్మా’ సిరీస్ రివ్యూ

Kajal Aggarwal: స్టార్ హీరోలు కూడా భయపడుతుంటే కాజల్‌ ఒక్కతే ధైర్యంగా కామెంట్ చేసింది

భారీగా ఆశ చూపినా… బిగ్ బాస్‌కు నో చెప్పిన రిషి సార్

OG Sequel: చేతులు మారిన OG సీక్వెల్ ??