విజయదశమికి ముహూర్తాలు పెడుతున్న హీరోలు

Updated on: Oct 02, 2025 | 4:11 PM

ఏదైనా కొత్త సినిమా మొదలుపెట్టడానికి విజయదశమి కంటే మంచి ముహూర్తం ఏముంటుంది చెప్పండి..? అందుకే మన హీరోలు కూడా క్రేజీ సినిమాలన్నింటినీ దసరాకే షురూ చేయబోతున్నారు. అందులో ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. మరి ఈ దసరాకు మొదలు కాబోయే ఈ సినిమాలేంటి..? ఎప్పట్నుంచో వేచి చూస్తున్న కాంబినేషన్స్‌కు దసరాకు ముహూర్తం సెట్ అయింది.

పండగ రోజే ఆ సినిమాలను మొదలు పెట్టాలని చూస్తున్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన కాంబినేషన్ చిరంజీవి, బాబీ సినిమా. వాల్తేరు వీరయ్య తర్వాత మరోసారి రిపీట్ అవుతున్న కాంబినేషన్ ఇది. దసరా రోజే పూజా కార్యక్రమాలు చేయాలని చూస్తున్నారు మేకర్స్. చాలా రోజుల కిందే ఖరారైన విజయ్ దేవరకొండ, రవికిరణ్ కోలా సినిమా కూడా దసరాకే రోల్ కానుందని తెలుస్తుంది. ప్రస్తుతం రాహుల్ సంక్రీత్యన్ సినిమాతో బిజీగా ఉన్నారు విజయ్. దీనితర్వాత రవికిరణ్ సినిమా సెట్స్‌పైకి రానుంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించబోతున్నారు. రూరల్ యాక్షన్ డ్రామాగా రానుంది ఈ చిత్రం. ఓజితో పవన్ కళ్యాణ్ అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టిన సుజీత్.. నెక్ట్స్ ప్రాజెక్ట్ నానితో చేయబోతున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు దసరాకే చేయబోతున్నట్లు తెలుస్తుంది. రెగ్యులర్ షూట్ మాత్రం 2026లోనే మొదలు కానుంది. నాని ప్రస్తుతం ప్యారడైజ్ సినిమాతో బిజీగా ఉన్నారు. మొత్తానికి ఈ క్రేజీ కాంబోస్ అన్నీ త్వరలోనే సెట్స్‌పైకి రానున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

OG యూనివర్స్‌పై పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన

ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన.. వికీపీడియాకు పోటీగా మరో ప్లాట్‌ఫాం

చీరకట్టులో పురుషుల గర్బా డ్యాన్స్‌.. ఎందుకంటే ??

దసరా రోజు పాలపిట్టను చూడాలి.. ఎందుకంటే ??

భారీ భూకంపం.. 69 మంది మృతి