Dulquer Salmaan: దుల్కర్ సెంటిమెంట్.. కాంతకు కలిసొస్తుందా ??

Edited By: Phani CH

Updated on: Nov 01, 2025 | 8:46 AM

కంపేరిజన్స్ స్టార్ట్ కాకుండా ఉండాలేగానీ, ఒక్కసారి షురూ అయ్యాయంటే.. మామూలుగా ఉండదు సీన్‌. లాస్ట్ దీపావళితో ముడిపెట్టి ఇప్పుడో కంపేరిజన్‌ నడుస్తోంది. ఇందులో ఒకరు ఈ ఇయర్‌ సక్సెస్‌ చూశారు. ఇంకో హీరో మూవీ కోసం జనాలు వెయిటింగ్‌.. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న ఆ రెండు సినిమాలు... ఆ ఇద్దరు హీరోల గురించి మీరు గెస్‌ చేస్తున్నట్టే ఉన్నారుగా.. ఇంకెందుకు ఆలస్యం.. చూసేద్దాం పదండి.

లాస్ట్ దివాలీ రేస్‌లో సూపర్‌ డూపర్‌ సినిమాగా మార్కులు కొట్టేసిన సినిమా లక్కీ భాస్కర్‌. ఏం తీశార్రా అనిపించేలా ఆడియన్స్ ని మెస్మరైజ్‌ చేసిందీ మూవీ. పీరియాడిక్‌ టచ్‌ ఉన్న రోల్‌లో సూపర్బ్ గా చేశారు దుల్కర్‌. అప్పటిదాకా ఎక్కడో మలయాళ స్టార్‌ అన్న ఫీల్‌ని ఈ మూవీతో పూర్తిగా తుడిచిపెట్టేసి… దుల్కర్‌ మనోడే అనిపించుకున్నారు. సేమ్‌ టైమ్‌లో రిలీజ్‌ అయింది క సినిమా. కిరణ్‌ అబ్బవరం నటించిన ఈ సినిమా స్క్రీన్ ప్లే జనాలను కట్టిపడేసింది. ఏమన్నా నెరేట్‌ చేశారా బాస్‌ అంటూ ఒకరికొకరు చెప్పుకుని మౌత్‌టాక్‌ తోనే హిట్‌ చేసేశారు క మూవీని. దీపావళి సెంటిమెంట్‌ని ఈ సారి కె ర్యాంప్‌తో కంటిన్యూ చేశారు కిరణ్‌ అబ్బవరం. యూత్‌ఫుల్‌ కంటెంట్‌తో జనాల్లోకి వెళ్లింది కె ర్యాంప్‌. మేం నమ్మిన థీమ్‌ జనాలకు కనెక్ట్ అయింది. ఇంత సక్సెస్‌ ఇచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు కిరణ్‌. ఈ ఏడాది కాంతాతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు దుల్కర్‌. ముందనుకున్న డేట్‌కి వచ్చి ఉంటే ఈ పాటికే సినిమా రిజల్ట్ మీద మనకు అవగాహను ఉండేది. కానీ, మూవీ రిలీజ్‌ వాయిదా పడింది. నవంబర్‌ 14న రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ సారి కూడా పీరియాడిక్‌ కాన్సెప్ట్ తోనే ప్రేక్షకులను పలకరించనున్నారు దుల్కర్‌. కాంత ప్రమోషనల్‌ స్టఫ్‌కి పాజిటివ్‌ ఫీడ్‌ బ్యాక్‌ అందుతోంది. అది బాక్సాఫీస్‌ దగ్గర రిఫ్లెక్ట్ అయితే దుల్కర్‌ పక్కా తెలుగు హీరోగా సెటిల్‌ అయినట్టే.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎవరెస్ట్‌ శిఖరంపై కుప్పకూలిన హెలికాఫ్టర్‌

మరో అల్పపీడనం మూడు రోజులు భారీ వర్షాలు

ప్రకాశం బ్యారేజ్‌కు తప్పిన పెను ప్రమాదం

భీమవరం అంటే‌.. ప్రభాస్ ఫ్యాన్స్ ఆ మాత్రం ఉండాల్సిందే

Published on: Nov 01, 2025 08:46 AM