దృశ్యం 3 స్టేటస్‌ ఏంటి..? ఉన్నట్టా.. లేనట్టా? వీడియో

Updated on: Nov 03, 2025 | 4:17 PM

దృశ్యం 3 మలయాళ వెర్షన్ వేగంగా పనులు జరుపుకుంటుండగా, తెలుగు, హిందీ వెర్షన్లపై సందిగ్ధత కొనసాగుతోంది. దర్శకుడు జీతూ జోసెఫ్ ప్రకటించినా, వెంకటేష్, అజయ్ దేవగన్ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఈ భాషల్లో సినిమా ఉంటుందా, లేక మలయాళ వెర్షన్ పాన్ ఇండియాగా విడుదలవుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

దృశ్యం 3 సినిమా విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. దర్శకుడు జీతూ జోసెఫ్ స్వయంగా ప్రకటించినప్పటికీ, తెలుగు, హిందీ వెర్షన్ల విషయంలో ఇప్పటికీ స్పష్టత కొరవడింది. అన్ని భాషల్లో ఒకేసారి సినిమాను విడుదల చేయాలన్న ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వడం లేదు. అసలు దృశ్యం 3 నిర్మాణంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? దృశ్యం సిరీస్‌లోని మునుపటి రెండు చిత్రాలు భారీ విజయం సాధించాయి. మలయాళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ ఈ చిత్రాలకు విశేష ప్రేక్షకాదరణ ఉంది. అందుకే, మూడవ భాగం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల జీతూ జోసెఫ్ దృశ్యం 3 అప్‌డేట్ ఇచ్చిన వెంటనే షూటింగ్ ప్రారంభించారు.

మరిన్ని వీడియోల కోసం :

తలుపు తీసి ఇంట్లోకి వెళ్లిన వ్యక్తి..గదిలో సీన్‌ చూసి షాక్‌ వీడియో

మరో మూడు రోజులు భారీ వర్షాలు వీడియో

రూ.11 కోట్ల జాక్‌పాట్‌ కొట్టాడు..కానీ వీడియో

Published on: Nov 03, 2025 04:10 PM