Naga Chaitanya: చైతూకు ఇంకో తమ్ముడు ఉన్నాడా ??

Updated on: Apr 20, 2025 | 6:53 PM

అక్కినేని కుటుంబం నుంచి మూడో తరం హీరోగా తెరపైకి వచ్చిన నాగ చైతన్య తన నటనతో అభిమానుల మనసు దోచుకున్నాడు. ప్రతి చిత్రంలో వైవిధ్యంగా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాడు. అక్కినేని ఫ్యామిలీకి అచ్చివచ్చిన రొమాంటిక్ స్టోరీస్ తో ప్రేక్షకులకు దగ్గరైన చైతూ.. జోష్ నుంచి తండేల్ వరకు కెరీర్ గ్రాఫ్ పెంచే సినిమాలనే ఎంచుకున్నాడు.

ఒకవైపు లవర్ బోయ్ ఇమేజ్ కొనసాగిస్తూనే అప్పుడప్పుడూ భిన్న పాత్రలను ఎంచుకున్నాడు. నాగ చైతన్య తల్లితండ్రులిద్దరిదీ సినిమా కుటుంబాలే. చైతూ తల్లి లక్ష్మి నాగార్జునకు మొదటి భార్య. రామానాయుడు కూతురైన ఆమె.. ఎక్కువగా బయట కనిపించరు. పెళ్లైన ఆరేళ్లకు అంటే నాగచైతన్యకు 4ఏళ్ల వయసున్నప్పుడు నాగ్, లక్ష్మీలు విడిపోయారు. చైతూ కొంతకాలం తల్లి దగ్గరే పెరిగినా కాస్త ఊహ తెలిశాక తండ్రి దగ్గరకు షిఫ్టయ్యాడు. చై సామ్ పెళ్లి వరకు ఆమె అజ్ఞాతంలోనే ఉండిపోయారు. నాగార్జున విడాకుల అనంతరం అమలను వివాహం చేసుకున్నారు. వారి కుమారుడే అఖిల్. నాగ చైతన్యకు అఖిల్ కాకుండా మరో తమ్ముడు ఉన్నాడు. నాగ చైతన్య తల్లి లక్ష్మి కూడా నాగార్జునతో విడిపోయిన తర్వాత విజయ రాఘవన్ ను రెండో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అమెరికా వెళ్లిపోయారు. లక్ష్మీ విజయ రాఘవన్ దంపతులకు కూడా కొడుకు ఉన్నాడు. అయితే అతను చాలా లో ప్రొఫైల్ మెయింటేన్ చేయడంతో ఎప్పుడూ బయట కనిపించలేదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బోర్డు తిప్పేసి.. సరికొత్తగా జనాల్లోకి పచ్చళ్ల సిస్టర్స్

దేవుళ్లతో కామెడీలొద్దు.. ఇచ్చిపడేస్తారు…