The GOAT: డైరెక్టర్‌కు కోపం వస్తే రిజెల్ట్‌ ఇట్లనే ఉంటది.! గోట్‌ టాక్‌ పై డైరెక్టర్ రియాక్షన్..

|

Sep 11, 2024 | 5:33 PM

విజయ్‌ హీరోగా, వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ది గోట్‌'. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. సెప్టెంబర్‌ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలోనే మంచి వసూళ్లను రాబట్టుతోంది. ఇప్పటి వరకు ఈ సినిమా ఏకంగా 280 కోట్లకుపైగా రాబట్టి హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది.

విజయ్‌ హీరోగా, వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ది గోట్‌’. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. సెప్టెంబర్‌ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలోనే మంచి వసూళ్లను రాబట్టుతోంది. ఇప్పటి వరకు ఈ సినిమా ఏకంగా 280 కోట్లకుపైగా రాబట్టి హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది.

ఇక ఓ వైపు కలెక్షన్ల విషయంలో రికార్డులు సృష్టిస్తున్న ఈ సినిమాకు నెగిటివ్‌ టాక్ వెంటాడుతోంది. సినిమా బాగాలేదంటూ కొన్ని నెగిటివ్‌ రివ్యూలు కూడా వస్తున్నాయి. అయితే తాజాగా వీటిపై దర్శకుడు వెంకట్ ప్రభు స్పందించారు. ఈ సినిమాను తెరకెక్కించింది ప్రేక్షకుల కోసమని, విమర్శకుల కోసం కాదని తేల్చి చెప్పారు వెంకట్ ప్రభు. సినిమా తెరకెక్కించేందుకు తాము పడ్డ కష్టాన్ని ఎవరూ గుర్తించరని, కానీ కొందరు మాత్రం కావాలనే చిత్రంపై నెగెటివ్‌ కామెంట్స్‌ చేస్తుంటారని దర్శకుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇక గోట్‌ మూవీలో ఉన్న రిఫరెన్స్‌లు ఏ సినిమాలోనూ ఉండవని, ఏ హీరో ఫ్యాన్ అయినా ఈ చిత్రాన్ని సెలబ్రేట్‌ చేసుకోవాలనే ఆలోచనతోనే రిఫరెన్స్‌లను తీసుకున్నాం అన్నాడు. అతిథి పాత్రల కోసమే సినిమాను చేయలేదని.. ఆడియెన్స్​, అభిమానులు కోరుకునే అన్ని అంశాలను కథలో ఉండేలా తీర్చిదిద్దాం అన్నాడు.సినిమా ప్రేక్షకుల కోసమే గానీ రివ్యూవర్స్‌ కోసం కాదంటూ గట్టిగా చెప్పాడు. అందరినీ మెప్పించేలా మూవీ తెరకెక్కించాలంటే ఎంతో సమయం కావాలని.. తమకు కాస్త తక్కువ సమయమే ఉన్నప్పటికీ.. ది బెస్ట్‌నే ఇచ్చాం అన్నాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.