దేవరకొండ గ్లింప్స్‌ పై కామెంట్స్.. అసహనం వ్యక్తం చేసిన డైరెక్టర్

Updated on: Jan 29, 2026 | 11:50 AM

విజయ్ దేవరకొండ నటిస్తున్న రణబాలి సినిమా గ్లింప్స్‌ను AI సహాయంతో రూపొందించారని కొందరు నెటిజన్లు, రివ్యూయర్లు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రతి ఫ్రేమ్‌ను సాంప్రదాయ పద్ధతుల్లో ఎన్నో నెలలు కష్టపడి రూపొందించినట్లు ఆయన స్పష్టం చేశారు. విజయ్ దేవరకొండ రాయలసీమ యోధుడిగా నటిస్తున్న ఈ సినిమాపై వస్తున్న కామెంట్లు మేకర్స్ కష్టాన్ని తక్కువ చేస్తున్నాయని ఆయన ఆవేదన చెందారు.

విజయ్ దేవరకొండ తాజా చిత్రం రణబాలి గ్లింప్స్‌పై ఇటీవల సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు, రివ్యూయర్లు వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ఈ గ్లింప్స్‌ను కృత్రిమ మేధ (AI) సాంకేతికతతో రూపొందించారని, మేకర్స్ శ్రమించకుండా షార్ట్‌కట్‌ను అనుసరించారని ఆరోపణలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో చిత్ర డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ స్పందించారు. రణబాలి వీడియో గ్లింప్స్‌లోని ప్రతి ఫ్రేమ్‌ను పాత పద్ధతుల్లో, ఎంతో కష్టపడి డిజైన్ చేసినట్లు డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ వివరించారు. తన టీమ్ కొన్ని నెలల పాటు రేయింబవళ్లు కష్టపడి దీనిని రూపొందించిందని ఆయన ఎమోషనల్ అయ్యారు.

మరిన్ని వీడియోల కోసం :

టోల్‌గేట్‌ వద్ద గుట్టు గుట్టలుగా నోట్ల కట్టలు!

స్థిరంగా బంగారం ధరలు.. బడ్జెట్‌ తర్వాత తగ్గే ఛాన్స్‌?

ఏడేళ్లుగా రైల్వేపై విద్యార్థిని పోరాటం..చివరకు..

చిరు వ్యాపారులకు అమెజాన్‌ బిగ్‌ ఆఫర్‌