Raghavendra Rao: తండేల్ సినిమాపై రాఘవేంద్రరావు రివ్యూ

|

Feb 12, 2025 | 4:48 PM

అక్కినేని నాగచైతన్య హీరోగా డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించిన సినిమా తండేల్. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇందులో చైతూ సరసన సాయి పల్లవి నటించింది. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.

ఇందులో చైతూ, సాయి పల్లవి నటన, కెమిస్ట్రీపై ప్రశంసలు వస్తున్నాయి. ఇక ఈ చిత్రానికి దేవి శ్రీ అందించిన మ్యూజిక్ మరింత హైలెట్ అని చెప్పాలి. ఈ చిత్రంలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికే తండేల్ చిత్రానికి పాజిటివ్ రివ్యూస్ వస్తుండగా.. తాజాగా ఈ మూవీపై ప్రశంసలు కురిపించారు డైరెక్టర్ రాఘవేంద్ర రావు. తండేల్ సినిమాను చూసిన ఆయన తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఈ సినిమా తనకు చాలా నచ్చిందని అన్నారు. చాలా కాలం తర్వాత అద్భుతమైన ప్రేమకథను చూశానని అన్నారు. చాలా రోజులకు తండేల్ వంటి అద్భుతమైన ప్రేమకథను చూశాను. నాగచైతన్య, సాయి పల్లవి పోటీపడి నటించారు. చందు మొండేటి తీసుకున్న కథ.. దాని నేపథ్యం సాహసోపేతమే. షాట్ మేకింగ్ పై దర్శకుడి శ్రద్ధ బాగుంది. ఈ చిత్రంతో విజయాన్ని అందుకున్న గీతా ఆర్ట్స్ కు అభినందనలు. ఒక్క మాటలో ఇది ఒక దర్శకుడి సినిమా అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు రాఘవేంద్రరావు. ఇక తమ సినిమాను సీనియర్ దర్శకుడు ప్రశంసించడంపై నాగచైతన్య సంతోషం వ్యక్తం చేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Daaku Maharaaj: దిమ్మతిరిగే న్యూస్.. ఎక్స్‌ట్రా కంటెంట్‌తో.. OTTలోకి డాకు మహరాజ్‌

Thandel: తండేల్ సినిమా చూస్తూ.. వెక్కి వెక్కి ఏడ్చిన లేడీ

ఇకపై హెల్మెట్‌ పెట్టుకోకపోతే.. మీ బైక్‌ స్టార్ట్‌ కాదు

‘నాన్నా నువ్వు చనిపోతావా..’ కొడుకు మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న సైఫ్

సాయి పల్లవిని చూసి ఆశ్చర్యపోయిన నాగ్.. ఆకాశానికెత్తుతూ ట్వీట్!