హీరోయిన్‌తో చిన్న ఇల్లుపై ప్రశ్న? రిపోర్టర్‌పై డైరెక్టర్ సీరియస్!

Updated on: Jan 29, 2026 | 11:10 AM

ప్రెస్ మీట్లలో సెలబ్రిటీలను వ్యక్తిగత ప్రశ్నలతో ఇబ్బంది పెట్టడంపై తరచుగా విమర్శలు వస్తున్నాయి. తాజాగా కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. హీరోయిన్‌తో ప్రేమ, పెళ్లి రూమర్లపై రిపోర్టర్ పదేపదే అడగడంతో, లోకేష్ ఆగ్రహానికి గురయ్యారు. తాను వివాహితుడినని స్పష్టం చేసినా, రిపోర్టర్ రెండవ కుటుంబం గురించి ప్రస్తావించడంతో లోకేష్ ప్రెస్ మీట్ ముగించి వెళ్లిపోయారు.

తెలుగు సినీ పరిశ్రమతో పాటు, ఇతర భారతీయ సినీ పరిశ్రమల్లోనూ ప్రెస్ మీట్లలో రిపోర్టర్లు అడిగే ప్రశ్నల తీరుపై తరచుగా చర్చ జరుగుతోంది. కొందరు రిపోర్టర్లు సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై నాన్-సింక్ ప్రశ్నలు అడుగుతూ వారిని ఇబ్బంది పెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ధోరణికి తాజాగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కూడా బలయ్యారు. ఆయనకు ఒక ప్రెస్ మీట్‌లో ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైంది. రీసెంట్‌గా లోకేష్ కనగరాజ్ నిర్వహించిన ఒక ప్రెస్ మీట్‌లో, ఒక రిపోర్టర్ లోకేష్ వ్యక్తిగత జీవితంపై అసంబద్ధ ప్రశ్నలు సంధించారు. సోషల్ మీడియాలో ఒక హీరోయిన్‌తో లోకేష్ ప్రేమలో ఉన్నారని, త్వరలో ఆమెను పెళ్లి చేసుకోబోతున్నారని వస్తున్న రూమర్స్‌పై సదరు రిపోర్టర్ ప్రశ్నించారు.

మరిన్ని వీడియోల కోసం :

టోల్‌గేట్‌ వద్ద గుట్టు గుట్టలుగా నోట్ల కట్టలు!

స్థిరంగా బంగారం ధరలు.. బడ్జెట్‌ తర్వాత తగ్గే ఛాన్స్‌?

ఏడేళ్లుగా రైల్వేపై విద్యార్థిని పోరాటం..చివరకు..

చిరు వ్యాపారులకు అమెజాన్‌ బిగ్‌ ఆఫర్‌