Anil Ravipudi: నెక్ట్స్ మూవీకి ఆ హీరోని రెడీ చేస్తున్న అనిల్ రావిపూడి ?

Updated on: Jan 31, 2026 | 1:05 PM

వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి తన తదుపరి చిత్ర పనులను ప్రారంభించారు. విక్టరీ వెంకటేష్ తో కలిసి మరోసారి మ్యాజిక్ సృష్టించేందుకు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి, ఈసారి కూడా మల్టీస్టారర్ కాన్సెప్ట్ తో రాబోతున్నారు. కార్తీ, ఫహద్ ఫాజిల్ వంటి స్టార్లను మరో ముఖ్య పాత్రకు సంప్రదిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది.

వరుస విజయాలతో సూపర్ ఫామ్ లో ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి తన తదుపరి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేశారు. ఇటీవల విడుదలైన మన శంకర వరప్రసాద్ గారు అందించిన విజయ ఉత్సాహంలోనే కొత్త సినిమా ప్రణాళికలు రచించారు. అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రాన్ని విక్టరీ వెంకటేష్ తో చేయనున్నారు. ఎఫ్ 2 నుండి మన శంకర వరప్రసాద్ గారు వరకు ఈ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్టే. మరోసారి అదే విజయ మ్యాజిక్ ను రిపీట్ చేయడానికి వారు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం మల్టీస్టారర్ కాన్సెప్ట్ తో తెరకెక్కనుంది. వెంకటేష్ తో పాటు మరో స్టార్ హీరో కూడా ఈ చిత్రంలో నటించనున్నారు. ఈ పాత్ర కోసం కార్తీ, ఫహద్ ఫాజిల్ వంటి ప్రముఖ నటులను సంప్రదిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Director Shankar: కండిషన్ పెట్టిన ప్రొడ్యూసర్‌.. శంకర్‌ పాస్‌ అవుతారా ??

గ్లోబల్‌ స్టేజ్‌లో.. ట్రిపుల్‌ ఆర్‌ హీరోల రేంజ్‌ ఏంటి ??

Peddi vs Fauzi: పోటాపోటీగా ఫౌజీ.. పెద్ది.. బరిలో నిలిచేదెవరు ?? గెలిచేదెవరు ??

Shraddha Kapoor: దీపిక రూట్లో శ్రద్ధ.. ఐకాన్‌స్టార్‌ కోసమేనా ??

Boyapati Sreenu: బోయపాటి ప్యాన్ ఇండియా ఫిల్మ్.. మరి రణ్‌వీర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారా ??