Dhoni: గాడ్‌ ఫాదర్‌ లుక్‌లో మిస్టర్ కూల్ ధోని.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్

|

Jul 07, 2022 | 8:40 PM

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం గాడ్ ఫాదర్. మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ లూసిఫర్‌ రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.


మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం గాడ్ ఫాదర్. మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ లూసిఫర్‌ రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. హనుమాన్‌ జంక్షన్‌ ఫేం మోహన్‌ రాజా దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో సల్మాన్‌ఖాన్‌, నయనతార, సత్యదేవ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమానుంచి మెగాస్టార్ మొదటి లుక్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఇందులో నెరిసిన జట్టుతో బ్లాక్‌ డ్రెస్‌లో కనిపించి మరోసారి అభిమానులను ఆకట్టుకున్నారు చిరంజీవి. ప్రస్తుతం ఈ లుక్‌ నెట్టింట్‌ ట్రెండ్‌ అవుతోంది. అయితే తాజాగా గాడ్‌ఫాదర్‌ లుక్‌లో చిరంజీవికి బదులు టీమిండియా మాజీ క్రికెటర్‌, మిస్టర్‌ కూల్‌ మహేంద్ర సింగ్‌ ధోని ని మార్చేసింది స్టార్‌ స్పోర్ట్స్‌ తెలుగు టీం. మార్చడమే కాదు..ఆ పిక్‌ ను సోషల్ మీడియాలో షేర్చేసి.. నో క్లాస్ – నోమాస్ ! ఓన్లీ కూల్ అనే ట్యాగ్‌ను ఆ ఫోకు ఇచ్చింది. వన్‌ అండ్ ఓన్లీ తలా అంటూ.. మరో ట్యాగ్ ఇచ్చి ఈ పిక్ ను నెట్టింట వైరల్ అయ్యేలా చేసింది స్టార్ టీం.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Megastar Chiranjeevi: చిరంజీవి పేరు మార్పుపై గాడ్‌ ఫాదర్‌ టీం క్లారిటీ

Deepika Padukone: పెళ్లయితే ఏం.. రొమాంటిక్ సీన్స్‌ చేయకూడదా ?? నా భర్తకు లేని అభ్యంతరం మీకెందుకు ??

ఆర్ఆర్ఆర్ ట్రోల్స్ పై కీరవాణి ట్వీట్.. ఆ తల్లి సంకల్పమే కనిపిస్తుందంటూ

సమంత ఇన్‏స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యిందా ?? క్షమాపణలు చెప్పిన సమంత డిజిటల్‌ మేనేజర్‌

Published on: Jul 07, 2022 08:40 PM