‘మా నాన్న చనిపోలేదు..’ తప్పుడు వార్తలపై ధర్మేంద్ర కూతురు సీరియస్
బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర మరణించారనే తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన కూతురు ఈషా డియోల్ ఈ వదంతులను ఖండించారు. ధర్మేంద్ర శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రిలో చేరారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఈషా స్పష్టం చేశారు. మీడియా అతిగా స్పందించవద్దని, తమ కుటుంబ గోప్యతను గౌరవించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
బాలీవుడ్ వెటరన్ స్టార్ హీరో ధర్మేంద్ర చనిపోయండంటూ.. మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ వార్తలు గుప్పుమన్నాయి. దీంతో నార్త్ మొత్తం ఒక్క సారిగా షాకైంది. ధరేంద్ర తోటి నటీనటులతో పాటే.. చాలా మంది సెలబ్రిటీలు.. ధరేంద్ర ఆత్మకు శాంతి కలగాలని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇక ఈక్రమంలోనే ధరేంద్ర కూతురు ఇషా డియోల్.. తన తండ్రి ఇంకా చనిపోలేదంటూ.. ఓ పోస్ట్ పెట్టింది. తన ధర్మేంద్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో… మీడియా కాస్త అతిగా స్పందించిందని.. తన తండ్రి చనిపోడంటూ.. వార్తలను పబ్లిష్ చేసిందని.. కానీ ఆ వార్తలో నిజం లేదంటూ.. తప్పుడు వార్తలంటూ పోస్ట్ చేసింది ఇషా. అంతేకాదు తన తండ్రి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని.. కోలుకుంటున్నాడని తన పోస్టులో కోట్ చేశారు ఆమె. అంతేకాదు ఇలాంటి క్లిష్ట పరిస్తితుల్లో తమ ఫ్యామిలీకి ప్రైవెసీ కావాలని.. దాని కోసం అందరూ సహకరించాలంటూ ఇషా రిక్వెస్ట్ చేసింది.అలాగే తన తండ్రి ఆరోగ్యం కోసం దేవుడిని ప్రార్థించిన అందరికీ కృతఙతలు తెలిపింది ఇషా. ఇక గత కొంత కాలంగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ధరేంద్ర.. పరిస్థితి విషమించడంతో బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు.ఇంటెన్సిస్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈక్రమంలోనే ఆయన మరణించాడంటూ.. కొన్ని మీడియా .. సోషల్ మీడియా ఛానెళ్లు అత్యుత్సాహంతో వీడియోలు , ఆర్టికల్స్‌ను పబ్లిష్ చేశాయి. తీరా ధర్మేంద్ర కూతురు ఇషా క్లారిటీ పోస్టుతో.. ఈ వార్తలు ఆగిపోయాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘మెడలో నక్లెస్ కాదు.. పెళ్లికి వడ్డానం కూడా పెట్టుకుంటా’ ట్రోలర్స్‌కు శిరీష్ దిమ్మతిరిగే పంచ్
తాను ఊహించినట్టే.. ఈ హీరో మరణించాడు..! డెస్టినీ అంటే ఇదేనేమో
