Dhanush: మరో వివాదంలో ధనుష్.. ఆ సినిమా పై కేసు
ధనుష్ నటించిన బాలీవుడ్ చిత్రం తేరే ఇష్క్ మే లీగల్ చిక్కుల్లో పడింది. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ, తమ అనుమతి లేకుండా రాంఝానా సీక్వెల్‌గా ప్రచారం చేశారని ఆరోపిస్తూ చిత్ర యూనిట్‌పై కేసు పెట్టింది. ఈ ప్రచారం వల్లే సినిమా భారీ వసూళ్లు సాధించిందని పేర్కొంటూ ₹84 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేసింది.
ధనుష్ హీరోగా బాలీవుడ్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ తేరే ఇష్క్ మే ఘన విజయం సాధించినప్పటికీ, ఇప్పుడు అది చిత్ర యూనిట్‌ను లీగల్ ట్రబుల్స్‌లో పడేసింది. ఈ సినిమా విడుదలకు ముందు చేసిన కొన్ని ప్రచార కామెంట్లు ప్రస్తుతం పెద్ద వివాదంగా మారాయి. ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో వచ్చిన రాంఝానా సినిమాతో తమిళ స్టార్ ధనుష్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఇదే కాంబినేషన్‌లో వచ్చిన షమితాబ్ సినిమా కూడా మంచి స్పందన పొందింది. ఈ క్రేజ్‌ను ఉపయోగించుకుంటూ, గతేడాది తేరే ఇష్క్ మే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తగ్గేదే లే అంటున్న సీనియర్ స్టార్లు.. దూకుడు మాములుగా లేదుగా
Allari Naresh: హీరో నరేష్ ఇంట తీవ్ర విషాదం
హృదయవిదారకం.. ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు.. ఏం జరిగిందంటే.. ?
వెండి బంగారం ధరలపై గ్రీన్‌ల్యాండ్ ఎఫెక్ట్.. తులం బంగారం లక్షన్నర