అవాక్కయే న్యూస్… వేణు ఎల్లమ్మ సినిమాలో హీరోగా దేవి

Updated on: Oct 18, 2025 | 12:42 PM

ఆఫ్టర్ బలగం సూపర్ డూపర్ హిట్... వేణు ఎల్లమ్మ అనే ప్రాజెక్ట్‌ను రెడీ చేసుకున్నాడు. తనకు డైరెక్టర్‌గా అవకావం ఇచ్చిన దిల్ రాజు ప్రొడక్షన్లో ఈ సినిమాను తెరకెక్కించాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాడు. ఈక్రమంలోనే చాలా మంది హీరోలను అప్రోచ్ కూడా అయ్యాడు. కట్ చేస్తే ఎట్టకేలకు ఈ సినిమా కోసం ఓ హీరోను ఎంచుకున్నాడు వేణు.

అయితే ఆ హీరో ఎవరో కాదు.. మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ అనే న్యూస్ బయటికి రావడం ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది. బలగం వేణు.. తన ఎల్లమ్మ కథను.. వెరీ ప్రెస్టీజియస్ తెరకెక్కించాలనుకున్నాడు. దిల్ రాజు కూడా భారీ బడ్జెట్ పెట్టేందుకు రెడీ అయ్యాడు. ఈక్రమంలోనే మొదట ఈ సినిమా స్టోరీ నాచురల్ స్టార్ నాని కాంపౌండ్‌కు వెళ్లింది. అన్నీ ఓకే అయిపోయాయని.. తొందర్లో షూటింగ్ మొదలవుతుందని అందరూ అనుకునేలోపు.. నాని ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఇక ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ నితిన్‌తో చేస్తున్నట్టు దిల్ రాజు చెప్పడం అప్పట్లో సంచలనంగా మారింది. కానీ నితిన్ తమ్ముడు సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో.. నితిన్‌ కూడా ఈసినిమా నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఆ తర్వాత ఎల్లమ్మ ప్రాజెక్ట్ శర్వా నంద్ చేతుల్లోకి వెళ్లిందని, తమిళ హీరో కూడా ఈ స్టోరీకి ఓకే చెప్పినట్టు వార్తలు బయటికి వచ్చాయి. కానీ వాటినన్నింటని పక్కకు నెడుతూ.. బలగం వేణు, దిల్ రాజు ఈ సినిమాలో దేవీ శ్రీ ప్రసాద్‌ను హీరోగా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. దేవీ కూడా ఎల్లమ్మ లాంటి కథతోనే ఇండస్ట్రీలోకి హీరోగా లాంచ్ అవ్వడం బెటర్‌ అని ఫీలవుతున్నట్టు వినికిడి. ఇక ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అఫీషియల్ న్యూస్ దిల్ రాజు కాంపౌండ్‌ నుంచి తొందర్లోనే రానుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Telusu Kada: రాసుకున్నంత ఈజీ కాదు.. సినిమా తీయడం! హిట్టా..? ఫట్టా..?