Deepika Padukone: దీపిక మీద ఫైర్‌ అవుతున్న సౌత్ ఆడియన్స్‌.. ఎందుకు అంత కోపం ??

Updated on: Dec 12, 2025 | 3:49 PM

దీపికా పదుకొణ్ ఇటీవల సినిమా వార్తలతో కన్నా వివాదాలతోనే ఎక్కువగా చర్చనీయాంశంగా మారారు. సౌత్ చిత్రాలైన స్పిరిట్, కల్కి 2898 AD సీక్వెల్ వంటి వాటిని తిరస్కరించి, బాలీవుడ్ మైథలాజికల్ మూవీ మహాఅవతార్కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దక్షిణాది ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె సినిమా ఎంపికపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ మధ్యకాలంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణ్ తన సినిమా వార్తలతో కన్నా వివాదాలతోనే ఎక్కువగా ట్రెండ్ అవుతున్నారు. తాజాగా ఆమె నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన అప్డేట్ రావడంతో మరోసారి పరిశ్రమలో చర్చకు దారి తీసింది. దీపికా వరుసగా సౌత్ సినిమాలకు నో చెప్పి వార్తల్లో నిలిచారు. మోస్ట్ వైటెడ్ సినిమా స్పిరిట్తో పాటు, కల్కి 2898 AD సీక్వెల్ నుంచి కూడా తప్పుకోవడంతో దీపికా సినిమా ఎంపిక మరియు ఆమె పెడుతున్న కండిషన్స్ పై విమర్శలు వస్తున్నాయి. దక్షిణాది ప్రేక్షకులు దీపికా పదుకొణ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మరో అప్డేట్ తో ఆమె దక్షిణాది ప్రేక్షకులకు మరింత కోపం తెప్పించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇప్పటి నుండే మొదలైన సమ్మర్ సినిమాల సమరం.. పోటీ మాములుగా లేదుగా

Sandeep Reddy Vanga: ఆ సినిమాతో సందీప్‌ రూలింగ్‌కు చెక్‌ పడినట్టేనా ??

Shah Rukh Khan: షారుక్ ఖాన్ సూపర్ హిట్ మూవీ సీక్వెల్‌.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడే

Pragathi: నన్ను చాలామంది ట్రోల్ చేశారు.. నేను నా గెలుపు తో సమాధానం చెప్పా