Deepika Padukone: ప్రెగ్నెంట్‌గా ఉండి రిస్కీ స్టంట్స్‌.. దీపిక డెడికేషన్‌కు ఫిదా అవుతున్న ఇండస్ట్రీ

Edited By:

Updated on: Jul 19, 2026 | 11:16 AM

ఏడు నెలల గర్భవతిగా ఉన్నప్పటికీ దీపికా పదుకొనే 'రాకా' సినిమా కోసం హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొంటూ తన అంకితభావాన్ని చాటుతున్నారు. అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ కోసం నైట్ షిఫ్ట్స్‌లోనూ షూటింగ్ చేస్తున్నారు. కుటుంబం, కెరీర్‌ను సమతుల్యం చేస్తూ దీపిక చూపిస్తున్న నిబద్ధతకు సినీ వర్గాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే తన డెడికేషన్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రెగ్నెన్సీలోనే పాన్ ఇండియా సినిమా కోసం హై-వోల్టేజ్ యాక్షన్ సీన్స్ లో నటిస్తున్నారు. సెవెంత్ మంత్ ప్రెగ్నెన్సీలోనూ ఏమాత్రం రెస్ట్ తీసుకోకుండా సినిమా కోసం కష్టపడుతూ డేరింగ్ అండ్ డాషింగ్ అనిపించుకుంటున్నారు. దీపిక అంత రిస్క్ తీసుకొని చేస్తున్న ఆ సినిమా ఏంటి..? ఫుల్ డిటైల్స్ ఈ స్టోరీలో చూద్దాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్ ‘రాకా’. ఈ సినిమాలో దీపికా పదుకొనే లీడ్ రోల్‌లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఏడు నెలల గర్భవతి అయిన దీపిక, ఈ మూవీ కోసం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా యాక్షన్ సీక్వెన్స్‌లో పాల్గొంటున్నారు. సెట్స్‌లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే యాక్షన్‌ సీన్స్‌లో పాల్గొంటున్నారు. మిగతా వాళ్ల డేట్స్ డిస్ట్రబ్‌ అవ్వకూడదన్న ఉద్దేశంతో నైట్ షిఫ్ట్స్ లోనూ వర్క్ చేస్తున్నారు. వీలైనంత త్వరగా తన పోర్షన్ మొత్తం పూర్తి చేయాలని పక్కా ప్లానింగ్‌తో షూట్స్‌లో పాల్గొంటున్నారు. గతంలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్, అలాగే ఎనిమిది గంటల వర్క్ షిఫ్ట్ గురించి మాట్లాడిన ఈ బాలీవుడ్ బ్యూటీ.. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కోసం తన కంఫర్ట్‌ను పక్కనపెట్టి మరీ నైట్ షిఫ్ట్స్ చేస్తున్నారు. ప్రెగ్నెన్సీ టైమ్‌లో దీపిక కమిట్‌మెంట్ చూసి కో-స్టార్స్, క్రూ మెంబర్స్ కూడా ఇన్‌స్పైర్ అవుతున్నారు. ఇంత బిజీగా షూటింగ్స్‌ చేస్తూనే ఫ్యామిలీ కూడా టైమ్ ఇస్తున్నారు ఈ బ్యూటీ. ఫ్రీ టైమ్‌లో కూతురితో టైమ్ స్పెండ్‌ చేస్తున్నారు. దీపిక ప్రొఫెషనల్ లైఫ్‌ని, పర్సనల్ లైఫ్‌ని పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తున్న తీరుకు ఫ్యాన్స్ అంతా హ్యాట్సాఫ్ చెబుతున్నారు. భారీ బడ్జెట్‌తో గ్లోబల్ రేంజ్‌లో తెరకెక్కుతున్న రాకా సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెళ్లి తర్వాతే అసలైన జోరు… మ్యారీడ్ హీరోయిన్లదే ఇప్పుడు ఇండస్ట్రీలో హవా..!

Varun Tej: హిట్ సెంటిమెంట్ ను నమ్ముకున్న వరుణ్ తేజ్.. ‘కొరియన్ కనకరాజు’పై భారీ ఆశలు

Varanasi: వారణాసికి అనుకోని సమస్య.. జక్కన్న ప్లాన్ ఏంటో..?

Suriya : ‘కరుప్పు’ విజయం తర్వాత సూర్య ఫుల్ స్పీడ్

పెద్ద సినిమాలకు A సర్టిఫికెట్.. పెద్దలకు మాత్రమే..!

Follow Us