దీపికకు అరుదైన ఘనత.. ఈ ఫీట్ సాధించిన ఏకైక ఇండియన్ స్టార్ ఈమే

Updated on: Jul 04, 2025 | 3:17 PM

భాషతో సంబంధం లేకుండా అలరిస్తుంటారు నటి దీపికా పదుకొణె. తాజాగా ఆమెకు అంతర్జాతీయస్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. ‘హాలీవుడ్‌ వాక్‌ ఆఫ్‌ ఫేమ్‌ స్టార్‌ 2026’కు ఎంపికయ్యారు. ఈమేరకు హాలీవుడ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మోషన్‌ పిక్చర్స్‌ విభాగంలో ఆమె ఈ ఘనతను సొంతం చేసుకున్నారు.

ఈ గౌరవం దక్కించుకున్న తొలి భారతీయ నటి దీపిక కావడం విశేషం. హాలీవుడ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ తాజాగా వెల్లడించిన జాబితాలో డెమి మూర్‌, రాచెల్‌ మెక్‌ఆడమ్స్‌, ఎమిలీ బ్లంట్‌ వంటి హాలీవుడ్‌ తారలతో పాటు దీపిక పేరు కూడా ఉండడంతో అభిమానులు ఆనందిస్తున్నారు. హాలీవుడ్‌ వాక్‌ ఆఫ్‌ ఫేమ్‌స్టార్‌ 2026కు 35 మంది ప్రతిభావంతులను ఎంపిక చేసినట్లు ఛాంబర్‌ తెలిపింది. వినోదరంగంలో గణనీయమైన కృషి చేసినందుకు గాను వీరిని ఎంపిక చేసినట్లు వెల్లడించింది. నటనతోనే కాకుండా తన స్పీచ్‌లతోనూ దీపికా పదుకొణె ఆకట్టుకుంటుంటారు. 2018లో టైమ్స్‌ మ్యాగజైన్‌ విడుదల చేసిన ‘100 మోస్ట్‌ ఇన్‌ఫ్లూయెన్షియల్‌ పీపుల్‌’ జాబితాలోనూ ఆమె చోటు దక్కించుకున్నారు. అలాగే 2022లో ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ను ఆవిష్కరించి ప్రపంచాన్ని ఆకర్షించారు. 2023లో జరిగిన ఆస్కార్‌ ప్రదానోత్సవంలో దీపిక ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని నాటునాటుని ఆడియన్స్‌కు పరిచయం చేశారు. ‘డు యూ నో నాటు?’ తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుంటారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం నుంచి ‘నాటు నాటు (ఇదే..’ అంటూ ఈ పాటను పరిచయం చేయడంతో వేదిక మొత్తం చప్పట్లతో మారుమోగింది. 2006లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన దీపిక 2017లో ‘త్రిబుల్‌ ఎక్స్‌: ది రిటర్న్‌ ఆఫ్‌ జాండర్‌ కేజ్‌’ తో హాలీవుడ్‌ తెరపై మెరిశారు. ప్రస్తుతం అల్లు అర్జున్‌.. దర్శకుడు అట్లీ కలయికలో రానున్న బహుభాషా చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో శక్తిమంతమైన యోధురాలిగా యాక్షన్‌ పాత్రలో కనిపించనున్నారు. దీని తర్వాత ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌లోనూ నటించనున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రభాస్ కోసం రంగంలోకి కరీనా !! థియేటర్స్ ఊగిపోయేలా.. మాస్‌ మసాలా నూరుతున్న తమన్

Nithya Menen: ప్రభాస్‌ కారణంగా మానసికంగా కుంగిపోయా..