Rashmika Mandanna: AI దుర్వినియోగం పై మండిపడ్డ రష్మిక
AI, ముఖ్యంగా డీప్‌ఫేక్ టెక్నాలజీ, హీరోయిన్లకు ఒక పీడకలగా మారింది, వారి ఫోటోలను అశ్లీలంగా మార్చేస్తోంది. ఈ దుర్వినియోగాన్ని రష్మిక మందన తీవ్రంగా ఖండించింది. ఇంటర్నెట్ కేవలం అద్దం కాదని, ఏదైనా సృష్టించగల కాన్వాస్ అని ఆమె నొక్కి చెప్పింది. AIని బాధ్యతాయుతంగా ఉపయోగించి, మహిళల పట్ల దుర్వినియోగం చేసేవారికి కఠిన శిక్షలు విధించాలని ఆమె పిలుపునిచ్చింది.
AI.. ఇప్పుడు హీరోయిన్లకు నైట్ మేర్ లా మారింది. వారి ఫోటోలను అశ్లీలంగా మార్చే ఒక సాధనంగా మారింది. ఈ క్రమంలోనే ఈ టెక్నాలిజీపై.. దాని దుర్వినియోగం పై రష్మిక మందన ఓ ట్వీట్ చేస్తూ మండిపడింది. మహిళలను లక్ష్యంగా చేసుకుని దుర్వినియోగానికి పాల్పడుతున్న కొంతమందికి నైతికత లేదంటూ ఫైర్ అయింది. ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి.. ఇంటర్నెట్ అనేది నిజానికి అద్దం లాంటిది కాదు.. అది ఏదైనా సృష్టించగలిగే ఓ కాన్వాస్. ఇకపై ఏఐ టెక్నాలజీని దుర్వినియోగం కాకుండా.. గౌరవప్రదమైన, ప్రగతిశీల సమాజాన్ని నిర్మించడానికి ఉపయోగించుకుందాం. ఇక్కడ మనం నిర్లక్ష్యం కంటే బాధ్యతగా వ్యవహరిద్దాం.. ప్రజలు మనుషుల్లా వ్యవహరించకపోతే.. అలాంటి వారికి కఠినమైన, క్షమించరాని శిక్షలు విధించాలి’ అంటూ పోస్ట్ చేసింది. ఇది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో కొందరు నెటిజన్స్ రష్మికకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆలస్యం అమృతం విషం.. ఆ ఆ హీరోల సినిమాలకు ఈ పేరే సెట్
రైలు టికెట్ కొన్న వారికి 5 ఉచిత సేవలు.. తప్పక వినియోగించుకోండి
రూ. 31 లక్షల కట్నం వద్దు.. ఒక్క రూపాయి చాలు అన్న వరుడు.. అవాక్కయిన అత్త మామలుడు
కార్పొరేట్ జాబ్ వదిలాడు.. ఆటో డ్రైవర్‌గా మారాడు..
ఉచిత బస్సులో కూర్చొన్నాడని.. ఉతికి పారేశారు.. బాబోయ్ అలా కొట్టారు ఏంటి
