Court: సంచలనంగా కలెక్షన్స్‌.. రూ.50 కోట్ల క్లబ్‌లో కోర్టు మూవీ

Updated on: Mar 27, 2025 | 2:06 PM

సినిమాల విషయంలో ప్రేక్షకుల తీర్పు ఎప్పుడూ ఒకేలా ఉండదు. పెద్ద స్టార్ వందల కోట్లతో మూవీ తీసినా కథలో కంటెంట్‌ లేకుంటే పక్కన పెట్టేస్తున్నారు. అదే ఊపొచ్చే క‌థ‌తో చిన్న హీరోలు సినిమా తీసినా బాక్సాఫీస్ బద్దలైపోతుంది. అలాంటిదే మార్చి 14న విడుదలైన చిన్న మూవీ కోర్టు. నేచురల్ స్టార్‌ హీరో నాని నిర్మాణంలో.. రామ్‌ జగదీష్ దర్శకత్వంలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కింది.

చిన్న చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన కోర్టు మూవీ ఊహించని విధంగా పెద్ద హిట్ కొట్టింది. విడుదలైన ఫస్ట్ రోజే రూ.8 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ మూవీ కేవలం పది రోజుల్లోనే రికార్డు వసూళ్లు రాబట్టింది. ఏకంగా రూ.50 కోట్ల క్లబ్‌లో చేరి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందం అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేసింది. ‘గొప్ప సినిమాను ఆదరిస్తోన్న ప్రేక్షకుల హిస్టారికల్ తీర్పు’ అంటూ క్యాప్షన్‌ కూడా ఇచ్చింది. ఇదొక హిస్టారిక్‌ జడ్జిమెంట్‌ అని పేర్కొంది. కేవలం రూ.9 నుంచి రూ.10 కోట్ల బడ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ మూవీ మున్ముందు భారీగానే లాభాలు రాబట్టే అవకాశం కనిపిస్తోంది. కోర్ట్ బ్యాక్ డ్రాప్ డ్రామాగా పోక్సో యాక్ట్ నేపథ్యంలో సినిమా రూపొందించారు. శ్రీదేవి, రోషన్ జంటగా నటించి తమ అద్భుత నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ వంటి సీనియర్‌ నటులు తమ పెర్ఫార్మెన్స్ తో తమ పాత్రలకు జీవం పోశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Manchu Lakshmi: ఓ ఫ్యామిలీని బాధపెట్టారు.. క్షమాపణలు చెప్పాల్సిందే..