‘వాళ్ల నాశనం చూశాకే.. నేను చస్తా…’ చంటీ ఎమోషనల్

Updated on: Jan 29, 2026 | 11:34 AM

జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటి గుండె సంబంధిత అనారోగ్యం, సినీ పరిశ్రమకు దూరం కావడంతో ఎదుర్కొన్న కష్టాలపై ఓ ఇంటర్వ్యూలో భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. డబ్బు ఉన్నప్పుడే లోకం పలకరిస్తుందని, కష్టాల్లో ఎవరూ పలకరించలేదని ఆవేదన చెందారు. తన ఎదుగుదలను అడ్డుకున్నవారి నాశనం చూశాకే చస్తానంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

జబర్దస్త్ కామెడీ షో ద్వారా కమెడియన్‌గా గుర్తింపు పొందిన చలాకీ చంటి, తనదైన చలాకీతనం, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించారు. సినిమాల్లోనూ హాస్యనటుడిగా నటించి మెప్పించారు. అయితే, ఆకస్మాత్తుగా గుండె సంబంధిత అనారోగ్యంతో ఆసుపత్రి పాలై, ఆ తర్వాత కోలుకున్నప్పటికీ సినిమాలకు, బుల్లితెరకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చంటి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తాను కష్టాల్లో ఉన్నప్పుడు సినీ రంగంలో తనకు పరిచయం ఉన్న ఏ ఒక్కరూ పలకరించలేదని, డబ్బు ఉంటేనే ఈ లోకం పలకరిస్తుందని ఆవేదన చెందారు. డబ్బు సంపాదిస్తున్నప్పుడు తన చుట్టూ ఉన్నవారెవరూ కష్టాల్లో ఉన్నప్పుడు రాలేదని ఎమోషనల్ అయ్యారు. తనకు ఈగో ఎక్కువని, షూటింగ్స్‌కి ఎక్కువ డబ్బు తీసుకుంటానని కొందరు నెగటివ్‌గా ప్రచారం చేశారని, సంబంధం లేని గొడవల్లో తన పేరు ఇరికించి అవకాశాలు దూరం చేశారని చంటి పేర్కొన్నారు.

మరిన్ని వీడియోల కోసం :

టోల్‌గేట్‌ వద్ద గుట్టు గుట్టలుగా నోట్ల కట్టలు!

స్థిరంగా బంగారం ధరలు.. బడ్జెట్‌ తర్వాత తగ్గే ఛాన్స్‌?

ఏడేళ్లుగా రైల్వేపై విద్యార్థిని పోరాటం..చివరకు..

చిరు వ్యాపారులకు అమెజాన్‌ బిగ్‌ ఆఫర్‌

Published on: Jan 29, 2026 08:01 AM