Mechanic Movie: ‘మెకానిక్’ లాంటి సినిమాలను ప్రజలు ఆదరించాలి..: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
టీనాశ్రీ క్రియేషన్స్ బ్యానర్‌పై మణిసాయితేజ-రేఖ నిరోషా జంటగా నటించిన చిత్రం ‘మెకానిక్’. ముని సహేకర దర్శకత్వం వహించడంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే, డ్కెలాగ్స్, పాటలు కూడా రాశారు. ఎం. నాగ మునెయ్య నిర్మాత. నందిపాటి శ్రీధర్‌రెడ్డి, కొండ్రాసి ఉపేందర్ సహ నిర్మాతలు. ఈ చిత్రం ఆడియో సూపర్‌హిట్ అయింది. టి`సిరీస్ ద్వారా విడుదలైన ఆడియో 10 మిలియన్‌లకు దగ్గరగా వెళ్లి రికార్డు సృష్టిస్తోంది.
టీనాశ్రీ క్రియేషన్స్ బ్యానర్‌పై మణిసాయితేజ-రేఖ నిరోషా జంటగా నటించిన చిత్రం ‘మెకానిక్’. ముని సహేకర దర్శకత్వం వహించడంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే, డ్కెలాగ్స్, పాటలు కూడా రాశారు. ఎం. నాగ మునెయ్య నిర్మాత. నందిపాటి శ్రీధర్‌రెడ్డి, కొండ్రాసి ఉపేందర్ సహ నిర్మాతలు. ఈ చిత్రం ఆడియో సూపర్‌హిట్ అయింది. టి`సిరీస్ ద్వారా విడుదలైన ఆడియో 10 మిలియన్‌లకు దగ్గరగా వెళ్లి రికార్డు సృష్టిస్తోంది. ఫిబ్రవరి 2న ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా తాజాగా హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరు కావాల్సి ఉన్నప్పటికీ, ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా చిత్ర యూనిట్‌ను తన ఇంటికి పిలిపించుకుని ఈ చిత్ర ట్రైలర్‌ను ఆవిష్కరించారు.
ఆ తర్వాత ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన కార్యక్రమానికి నిర్మాత, నటులు డి.యస్.రావ్, ‘శ్రీకాకుళం షెర్లాక్ హోo’ దర్శకుడు మోహన్ ముఖ్య అతిథిలు గా హాజరయ్యారు. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వీడియో బైట్ ద్వారా తన సందేశాన్ని ఇచ్చారు. ఇక ఆ వీడియోలో మంత్రి కోమటి రెడ్డి ఏమన్నారంటే.. ” నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ బాధిత ప్రాంతం ఎంతోమంది జీవితాలు ఈ ఫ్లోరైడ్ నీటి వల్ల నాశనం అయ్యాయి. రాబోయె రెండు సంవత్సరాల్లో నల్గొండ జిల్లాను పూర్తిగా ఫ్లోరైడ్ రహిత ప్రాతంగా చేస్తాము. ఈ ఫ్లోరైడ్ సమస్యను ప్రధానంగా తీసుకుని, సమాజానికి సందేశం ఇచ్చేలా రూపొందిన ‘మెకానిక్’ వంటి సినిమాలను ప్రజలందరూ ఆదరించాలి. దీని ద్వారా సమాజానికి ఈ సమస్య, బాధితుల బాధలు అర్ధమౌతాయి.అందరు థియేటర్ కెల్లి ఈ సినిమాని చూడవల్సిందిగా కోరారు. ఈ చిత్రం తప్పకుండా మoచి విజయం సాధిస్తుంది’ అన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos