Chiranjeevi: మరో సారి గొప్ప మనసు చాటుకున్న.. మెగాస్టార్ చిరు..
మెగాస్టార్ చిరంజీవి కేవలం సినీ హీరోగానే కాకుండా, నిజ జీవితంలోనూ మానవతావాదిగా నిలిచారు. పాతికేళ్లుగా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్‌లతో వేల ప్రాణాలు కాపాడారు. ఇటీవల గద్దర్ అవార్డ్స్ నుండి వచ్చిన రూ.10 లక్షల నగదును వివిధ స్వచ్ఛంద సంస్థలకు, రూ.5 లక్షలు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్‌కు విరాళంగా ఇచ్చారు. భవిష్యత్తులో పేద పిల్లలకు ఉచిత విద్య అందించేందుకు నూతన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
సినిమాల్లో హీరోలు చాలా మంది ఉంటారు… కానీ నిజ జీవితంలో హీరోగా నిలిచేవారు మాత్రం అరుదు. అలాంటి అరుదైన వ్యక్తిత్వం కలిగిన మానవతావాది మెగాస్టార్ చిరంజీవి. ఆయన కేవలం హీరోగానే కాదు, కోట్లాది హృదయాల్లో మనసున్న మనిషిగా కూడా నిలిచిన ఆపద్బాంధవుడు. పాతికేళ్ల క్రితమే చిరంజీవి బ్లడ్ బ్యాంక్, చిరంజీవి ఐ బ్యాంక్ లను స్థాపించి వేలాది మందికి జీవం పోశారు. కరోనా వంటి కష్టకాలంలో ఆక్సిజన్ సిలిండర్లు, మందులు అందించి ఎన్నో ప్రాణాలు కాపాడారు. లాక్‌డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులకు అండగా నిలిచారు. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడల్లా ముందుండి సహాయం చేయడంలో ఆయన చూపే చొరవ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఎన్నోసేవ కార్యక్రమాలతో నిరంతరం ప్రజలకు అండగా నిలిచే మెగాస్టార్.. తాజాగా మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇటీవల గద్దర్ అవార్డ్స్ లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారంతో పాటుగా స్వీకరించిన రూ.10 లక్షల నగదు బహుమతిని స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా అందజేశారు చిరంజీవి . తన తనయుడు రామ్‌చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని దేవనార్ ఫౌండేషన్, వాల్మీకి ఫౌండేషన్, నయశ్రీ ఫౌండేషన్, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రితోపాటు, అనాథ వృద్ధుల్ని చేరదీస్తున్న సర్వ్ ఫౌండేషన్ సంస్థకు చిరంజీవి విరాళం అందజేశారు. అనాధ వృద్ధులను చేరదీస్తున్న ‘సర్వ్ ఫౌండేషన్’కు విరాళంగా చెక్ అందించి, 50 మంది వృద్ధులను బ్లడ్ బ్యాంక్‌కు ఆహ్వానించి, వారికి బట్టలు పెట్టారు. ప్రత్యేక విందు ఏర్పాటు చేసి, తన చేతులతో స్వయంగా వడ్డించి వారి మనసుల్లో ఆనందాన్ని నింపారు మెగాస్టార్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏటా అందజేస్తున్న గద్దర్ పురస్కారాల్లో భాగంగా చిరంజీవి ఇటీవల ఎన్టీఆర్ జాతీయ పురస్కారం అందుకున్నారు. రూ.10 లక్షల నగదు బహుమతితో కూడిన పురస్కారం ఇది. ఆ నగదునే అవసరార్థులకు విరాళంగా అందజేసి గొప్పమనసు చాటారు చిరంజీవి. ఇదే కాదు.. తాజాగా తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్‌కు 5 లక్షల రూపాయిలు అందజేసి తెలుగు ఫిల్మ్ జర్నలిస్టుల సంక్షేమం పట్ల తన ఉదారతను చాటుకున్నారు మెగాస్టార్. అంతేకాదు.. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మరో గొప్ప నిర్ణయం తీసుకున్నారు. పేద పిల్లలకు ఉచిత విద్య అందించాలనే మహోన్నత లక్ష్యంతో కొత్త సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు చిరు. భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, దేశవ్యాప్తంగానూ అవసరమైన పేద కుటుంబాల్లోని విద్యార్థులకు ఉచితంగా విద్యని అందించే విధంగా ఆయన సేవ కార్యక్రమాలని విస్తృతం చేయబోతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
షూటింగ్‌కు వెళ్లి.. సముద్రంలో పడి.. ప్రాణాలు కోల్పోయిన హీరో..
VV Vinayak: చిరంజీవిని తిడితే.. నాశనైపోతారు..! చిరు విమర్శకులకు వినాయక్ వార్నింగ్
Divvela Madhuri: పొట్టి బట్టలు వేసుకోవడం ఎందుకు ?? ఎవడో చూస్తున్నాడని సర్దుకోవడం ఎందుకు?
