Chiranjeevi – Ram Charan: రామ్ చరణ్ ను కాపీ కొట్టిన మెగాస్టార్.. చెర్రీ చొక్కా వేసుకుని పూనకాలు తెప్పించిన చిరు..

Updated on: Jan 02, 2023 | 10:05 AM

ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల వాల్తేరు వీరయ్య సినిమాలోని ‘పూనకాలు లోడింగ్’ పాట..

ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల సినిమా వాల్తేరు వీరయ్య. డైరెక్టర్ బాబీ రూపొందిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ఇందులోని పాటలు ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమాలోని ‘పూనకాలు లోడింగ్’ పాట ని సంధ్య 70 ఎంఎంలో గ్రాండ్ గా విడుదల చేశారు మేకర్స్. టైటిల్‌ కు తగ్గట్టు పాట క్లాస్, మాస్ ప్రేక్షకులకు పూనకాలను తెప్పించింది. మాస్ నంబర్ లను స్కోర్ చేయడంలో మాస్టరైన రాక్‌ స్టార్ దేవి శ్రీ ప్రసాద్..అందరికీ పూనకాలు తెప్పించేలా ఈ పాటని అవుట్ స్టాండింగ్ గా కంపోజ్ చేశారు. రోల్ రిడా పూనకాలు తెప్పించే లిరిక్స్ అందించడంతో పాటు రామ్ మిర్యాలతో కలసి ఫుల్ ఎనర్జీటిక్ గా పాడారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ తమ డైనమిక్ వాయిస్ తో ”డోంట్ స్టాప్ డ్యాన్సింగ్.. పూనకాలు లోడింగ్” అనడం పూనకాలని రెట్టింపు చేసింది.అయితే ఈ పాటలో చిరు వేసి షర్ట్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో చిరు ఎరుపు రంగు పూల చొక్కా ధరించి మాస్ స్టెప్పులతో అదరగొట్టాడు. ఆ షర్ట్ తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు కూడా ఓ సంబంధం ఉంది. చెర్రీ కూడా అచ్చం అలాంటి షర్ట్ నే ధరించి ఓ యాడ్ లో కనిపించాడు. దాంతో చిరు వేసిన షర్ట్ తనయుడు చెర్రీది అంటూ నెట్టింట షేర్ చేస్తున్నారు. అలాగే ఒకేలాంటి డిజైన్ ఉన్న షర్ట్ లో మెగాస్టార్, మెగా పవర్ స్టార్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందంగా ఫీల్ అవుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Crocodile-drone: అబ్భాబ్భా ఎం వీడియో గురు.. తనను క్యాప్చర్‌ చేస్తున్న డ్రోన్‌ను మొసలి ఏం చేసిందో చూస్తే..

School childrens: స్కూల్‌ పిల్లల్లోకి ఆత్మలు.. తాంత్రికుడిని పిలిచి పూజలు నిర్వహణ.. ఎవరో తెలిస్తే షాకే.!

Car accident: డ్రైవర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌.. ప్రశ్నించినందుకు కారుతో ఢీకొట్టి.. నడిరోడ్డుపై దారుణంగా.. వీడియో.

Published on: Jan 02, 2023 10:05 AM