VV Vinayak: చిరంజీవిని తిడితే.. నాశనైపోతారు..! చిరు విమర్శకులకు వినాయక్ వార్నింగ్
గద్దర్ అవార్డుల వేడుకలో చిరంజీవి ఏపీలో నంది అవార్డుల పునరుద్ధరణ కోరడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై దర్శకుడు వి.వి.వినాయక్ ఘాటుగా స్పందించారు. నంది అవార్డులు సినిమా రంగానికి ఎంత ముఖ్యమో వివరిస్తూ, చిరంజీవి అడిగిన దాంట్లో తప్పు లేదని, ఆయన నిజాయితీని ప్రశ్నించేవారు నాశనమవుతారని వ్యాఖ్యానించారు.
ఇటీవల తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ పై కొందరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎన్టీఆర్ నేషనల్ అవార్డును అందుకున్న చిరు.. ఆంధ్రప్రదేశ్ లో కూడా నంది అవార్డులను పునరుద్ధరించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని సినిమా ఇండస్ట్రీకి ప్రోత్సాహకాలు అందించాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే ఇప్పుడు ఆయన మాటలను కొందరు తప్పుపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా చిరంజీవిని ట్రోల్ చేస్తున్నారు. అయితే చిరుపై కొందరు చేస్తున్న విమర్శలపై దర్శకుడు వీవీ వినాయక్ కాస్త ఘాటుగా స్పందించారు. చిరంజీవి గురించి కొందరు మాట్లాడినప్పుడు తనకు చాలా బాధేస్తుందన్న వినాయక్.. వాటి గురించి తాను ఏదైనా మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుందన్నారు. ఒకవేళ తాము అలా ఎప్పుడైనా మాట్లాడినా కూడా చిరంజీవి మమ్మల్ని తిడతారన్నారు. చిరంజీవి మాట్లాడిన దాంట్లో అసలేమాత్రం తప్పు లేదని వినాయక్ అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు నంది అవార్డులు చాలా అంగ రంగ వైభవంగా జరిగేవని.. ఉగాది రోజు పండగ అంతా అక్కడే ఉన్నట్టు ఉండేదని.. మొత్తం అందరూ టీవీల ముందే ఉండేవారని.. ఒక పెద్ద సెలబ్రేషన్ లా జరిగేది వినాయక్ గుర్తు చేసుకున్నాడు. మళ్లీ అలాంటి వైభవం గద్దర్ అవార్డ్స్ లో కనిపించదని.. అలాంటి అవార్డ్సే ఏపీలో ఇవ్వాలని చిరు అడిగిన దాంట్లో తప్పే లేదన్నారు వినాయక్. చిరంజీవి ఆయన కోసం అవార్డులు ఇవ్వమని కోరలేదని.. అందరూ ఆనంద పడతారనే ఉద్దేశంతోనే అలా అన్నారన్నారు. అది కూడా తప్పని అనడం సమంజసం కాదని.. దయచేసి అనవసరంగా ఒక మంచి వ్యక్తి మీద, ఒక మంచి మనిషి మీద విమర్శలు చేయకండి అంటూ విమర్శకులకు రిక్వెస్ట్ చేశారు వినాయక్. అంతేకాదు నిజాయితీగల ఒక మంచి వ్యక్తిని ఒక మాట అంటే, అది కచ్చితంగా ఏదొక విధంగా వాళ్లకే తగులుతుందన్నారు వినియాకర్. చిరంజీవిని ఎవరైతే కామెంట్ చేస్తారో, వాళ్లంతా ఏదో ఒక రకంగా నాశనమైపోతారంటూ కామెంట్ చేశారు. తనకు కొన్ని వందల ఉదాహరణలు తెలుసని..ఎవరికి వాళ్లే ఆలోచించుకోవాలన్నారు. ఆయన్ని కామెంట్ చేసిన వాళ్లు ఎవరూ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో లేరు. ఏదో రకంగా పాడైపోయారు అంటూ చెప్పుకొచ్చారు వినాయక్
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Divvela Madhuri: పొట్టి బట్టలు వేసుకోవడం ఎందుకు ?? ఎవడో చూస్తున్నాడని సర్దుకోవడం ఎందుకు?
Telangana Rains: తెలంగాణకు మూడు రోజుల వర్షసూచన
అమ్మవారి విగ్రహానికి చెమటలు.. పూనకాలతో ఊగిపోయిన భక్తులు
అద్భుతం.. రామాలయంలో హనుమంతుడు ప్రత్యక్షం
Gold Price Today: పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం ధర ఎంతంటే ??
