Loading video

Vishnu Priya: పాపం విష్ణు ప్రియ! 11 మందిలో ఫస్ట్ బుక్కైంది ఈమే..

|

Mar 19, 2025 | 4:45 PM

బెట్టింగ్‌ బూజు దులుపుతున్నారు పోలీసులు. RTC ఎండీ సజ్జనార్‌ పిలుపుతో బెట్టింగ్‌ ప్రమోషన్లు చేస్తున్న వారి భరతం పడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నటి విష్ణుప్రియపై ఫోకస్‌ పెట్టారు. ఆమెపై కేసు నమోదు చేశారు. బెట్టింగ్ ప్రమోషన్లపై పోలీసుల సీరియస్ అవుతున్నారు. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లను గుర్తించి మరీ వారిపై కేసులుపెడుతున్నారు.

విచారణకు పిలుస్తున్నారు. ఇక తాజాగా పంజాగుట్ట పోలీసులు యాంకర్ విష్ణు ప్రియ విషయంలో ఇదే చేశారు. గతంలో విష్ణు ప్రియ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిందని గుర్తించిన పంజాగుట్ట పోలీసులు.. ఆమెపై కేసు నమోదు చేశారు. విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు. ఇందుకు సంబంధించి నోటీసులు జారీ చేశారు. ఇక విష్ణుప్రియ మాత్రమే కాదు.. విష్ణు ప్రియతో పాటు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన 11 మందిని గుర్తించి వారిపై కూడా కేసు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Samantha: సెలైన్ బాటిల్స్‌.. మందు బిళ్లలు! ఒక్క ఫోటోతో బయపడ్డ సమంత ఆరోగ్య పరిస్థితి