వేరే హీరోను పొగిడాడని.. మేనేజర్‌పై దాడి చేసిన మార్కో హీరో

Updated on: May 28, 2025 | 3:37 PM

మలయాళీ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై దాడి చేశారని ఆరోపిస్తూ ఆ హీరో మేనేజర్ విపిన్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కొచ్చిలోని తన అపార్ట్‌మెంట్‌కు వచ్చిన తర్వాత హీరో ఉన్ని ముకుందన్ తనపై దాడి చేశారని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు మేనేజర్ విపిన్ కుమార్.

కొంతకాలంగా అతడి నుంచి తీవ్ర వేధింపులు ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అతడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఉన్ని ముకుందన్ పై కేసు నమోదు చేశారు. ఇటీవల మరో హీరో టోవినో థామస్ కొత్త చిత్రం నరివెట్టను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.. మేనేజర్ విపిన్ కుమార్. ఆ కారణంగానే తనను హీరో ఉన్ని ముకుందన్ కొట్టాడని మేనేజన్ విపిన్ ఆరోపించాడు. తన అపార్ట్‌మెంట్‌కు వచ్చి, పార్కింగ్ స్థలానికి తీసుకెళ్లి, తనపై దాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మార్కో సినిమా తర్వాత అతడికి కొత్తగా అవకాశాలు రాకపోవడంతో కొన్ని రోజులుగా ఉన్ని ముకుందన్ మానసిక సంఘర్షణకు గురయ్యారని.. అదే సమయంలో తాను మరో హీరో సినిమాను ప్రశంసించడంతో తనపై దాడి చేశారని అన్నాడని విపిన్ అంటున్నాడు.. ఉన్ని ముకుందన్ తన సిబ్బందితో ఇలాగే ప్రవర్తిస్తాడని ఆరోపించాడు. ఇక ఈ విషయం పక్కకు పెడితే.. విపిన్ ఆరు సంవత్సరాలుగా ఉన్ని ముకుందన్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. 18 ఏళ్లుగా తాను ఇండస్ట్రీలో ఉన్నాడు. ముకుందన్ కంటే ముందు చాలా మంది హీరోల దగ్గర పని చేశాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కోటిన్నర కారు కొన్న స్టార్ కమెడియన్

రూ.235 కోట్లు వసూలు చేసిన తుడురుమ్‌ మూవీ ఇప్పుడు OTTలో…

చెడ్డీపై హీరో సాహసయాత్ర.. పోలీసుల వరకు మ్యాటర్

రూ.300 నుంచి రూ.50 కోట్ల వరకు! ప్రకాశ్ రాజ్ దిమ్మతిరిగే సంపాదన

సినిమాలోని దెయ్యం థియేటర్‌లోకి వచ్చిందా ?? వణుకుపుట్టించిన ఘటన