బాలయ్యను క్షమాపణలు కోరిన సీవీ ఆనంద్

Updated on: Nov 20, 2025 | 12:13 PM

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, బాలయ్య ఎమోజీ వివాదంపై స్పష్టతనిచ్చారు. పైరసీ నివారణ మీటింగ్‌కు బాలయ్య గైర్హాజరీపై వచ్చిన కామెంట్‌కు తన సోషల్ మీడియా హ్యాండ్లర్ తెలియక పెట్టిన ఎమోజీపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనంద్ ఇప్పుడు క్షమాపణ చెప్పి, అది తన ప్రమేయం లేకుండా జరిగిందని వివరించారు. తన టీం సభ్యులపై చర్యలు తీసుకున్నట్లు, ఈ వివాదాన్ని ముగించాలని అందరినీ కోరారు.

హైదరాబాద్ సిటీ పోలీసులు ఆమధ్య అతిపెద్ద సినిమా పైరసీ రాకెట్‌ గుట్టు రట్టు చేశారు. ఆ సమయంలో తెలుగు చిత్రరంగ ప్రముఖులతో ఓ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి బాలయ్య తప్ప అగ్ర హీరోలు అందరూ హాజరయ్యారు. పైరసీకి ఎలా చెక్ పెట్టాలి, టాలీవుడ్-పోలీసుల మధ్య సమన్వయంతో పని చేయడంపై లోతైన చర్చ జరిగింది. ఈ మీటింగ్‌కు సంబంధించిన వివరాలను సీవీ ఆనంద్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే ఓ నెటిజన్.. బాలయ్యను కూడా మీటింగ్‌కు పిలవండి.. అంటూ కామెంట్ పెట్టాడు. ఆ కామెంట్‌కి సీవీ ఆనంద్ తన ఖాతా నుంచి స్మైలీ ఎమోజీ పెట్టారు. ఆ ఎమోజీపై బాలయ్య అభిమానులు తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. దీంతో సారీ చెబుతూ మరో ట్వీట్ చేశారు ఆనంద్. స్టార్ హీరో అయిన బాలకృష్ణ గురించి చిన్న ఎమోజీతో సీవీ ఆనంద్ స్పందించడంపై ఫ్యాన్స్ ఫైరయ్యారు. ఈ వివాదం రెండు నెలలుగా సోషల్ మీడియాలో నలుగుతూనే ఉండగా.. తాజాగా సీవీ ఆనంద్ క్లారిటీ ఇచ్చారు. తన సోషల్ మీడియా ఖాతాలు చూసే వ్యక్తి.. తెలియక ఎమోజీని రిప్లైగా పెట్టాడని.. అది తన నాలెడ్జ్‌లో లేకుండా చేసిన పని అని, ఈ విషయాన్ని తాను వెంటనే తెలుసుకోలేకపోయానని క్లారిటీ ఇచ్చారు ఆనంద్. అంతేకాదు ఈ విషయం తెలిసిన వెంటనే.. ఆ పోస్ట్ డిలీట్ చేసి.. పూర్తి వివరాల గురించి వాకబు చేసినట్లు తెలిపారు. బాలకృష్ణతో తనకు ఎన్నో ఏళ్ల సాన్నిహిత్యం ఉన్నందున పర్సనల్ మెసెజ్ ద్వారా సారీ చెప్పినట్లు వెల్లడించారు. తనకు అగ్ర నటులు అందరిపై గౌరవం ఉందని చెప్పారు. ఆ రిప్లై ఇచ్చిన సోషల్ మీడియా హ్యాండ్లర్‌లను తొలగించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ వివాదం ఇక్కడితో ముగించాలని అందరికీ విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

SS Rajamouli: అటు పోలీస్ కేసు.. ఇటు టైటిల్ వివాదం! దెబ్బ మీద దెబ్బ!

Pawan Kalyan: శభాష్ సజ్జనార్..! పవన్‌ అభినందనలు

శబరిమలకు పోటెత్తిన భక్తులు.. స్వామి దర్శనానికి 18 గంటలు