రెండో సినిమాకు చరణ్.. మూడో సినిమాకు షారుఖ్
సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా 'ఉప్పెన'తో విజయం సాధించి, రామ్ చరణ్‌తో 'పెద్ది' సినిమాతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు, మైత్రీ మూవీ మేకర్స్ 500 కోట్ల భారీ బడ్జెట్‌తో షారుఖ్ ఖాన్‌తో ప్లాన్ చేస్తున్న పాన్ ఇండియా సినిమాకు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తారనే వార్తలు ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇది నిజమైతే, బుచ్చిబాబు కెరీర్‌లో ఇది పెద్ద మైలురాయి అవుతుంది.
సుకుమార్ శిష్యుడనే ట్యాగ్‌తో… డైరెక్టర్ అయిన బుచ్చిబాబు సనా.. తన ఫస్ట్ సినిమా ఉప్పెన హిట్‌తో.. ఆ ట్యాగ్‌ను పటాపంచలు చేసి తన పేరును టాలీవుడ్‌లో రీసౌండ్ అయ్యేలా చేసుకున్నారు. ఆ తర్వాత ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో సినిమా మొదలెట్టి పాన్ ఇండియా లెవల్లో తన పవర్ చూపించేందుకు తెగ కష్టపడుతున్నాడు. ఈ క్రమంలోనే ముచ్చటగా మూడో సినిమాకే బంపర్ ఛాన్స్ కొట్టేశాడు ఈ స్టార్ డైరెక్టర్. ఎట్ ప్రజెంట్ పెద్ది సినిమా మేకింగ్ తో బిజీగా ఉన్న డైరెక్టర్ బుచ్చిబాబు సనా బంపర్ ఛాన్స్ కొట్టినట్టుగా ఓ న్యూస్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. తెలుగులో బిగ్గెస్ట్ ప్రొడక్షన్ కంపెనీ అయిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ మధ్య పాన్ ఇండియా రేంజ్‌లో సినిమాలు ప్రొడ్యూస్ చేస్తోంది. వేరే భాషల్లోని స్టార్ హీరోలతో బిగ్ ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తోంది. ఈక్రమంలోనే బాలీవుడ్ కింగ్.. షారుఖ్ ఖాన్‌తో మైత్రీ ఓ బిగ్ పాన్ ఇండియా మూవీని సెట్ చేసే ప్రయత్నం చేస్తోందట. అందుకోసం 500 కోట్ల బడ్జెట్‌ను కేటాయించిందట. అయితే ఈసినిమా నిర్మాణ బాధ్యతలను మైత్రీ మేకర్స్ బుచ్చిబాబు చేతిలో పెట్టినట్టుగా న్యూస్. అంతేకాదు పెద్ది సినిమా తర్వాత.. బుచ్చిబాబు షారుఖ్ సినిమా కోసం పని చేయనున్నాడని.. ఇందుకోసం స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే జరుగుతుందని టాక్. మరి ఇదే కనుక నిజం అయితే.. బుచ్చి బాబు దశ తిరిగినట్టే అనే కామెంట్ వస్తోంది సోషల్ మీడియా నుంచి. అంతేకాదు రెండో సినిమాకు చరణ్.. మూడో సినిమాకు షారుఖ్ అంటే.. బుచ్చిబాబు లక్కు మామూలుగా లేదుగా అనే మీమ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Akhanda 2: బాలయ్య సినిమాకూ అవే కష్టాలు ?? కన్ఫ్యూజన్‌లో ఫ్యాన్స్
Prabhas: డ్యాన్స్ మాస్టర్‌కు .. గొప్ప ఛాన్స్ ఇచ్చిన ప్రభాస్
White Hair: తెల్ల జుట్టు మంచిదే.. క్యాన్సర్ ను అడ్డుకుంటుందట
సమోసా తింటున్నారా.. తప్పనిసరిగా ఇలా చేయండి.. లేదంటే
దెయ్యాన్ని చూసి భయపడిన ఎలుగుబంటి ఏం చేసిందంటే.. మస్త్ ఫీల్ ఉంది మామా
