కొత్త దారిలో స్టార్ వారసులు.. దర్శకులుగా మారుతున్న స్టార్ కిడ్స్‌

Updated on: Oct 22, 2025 | 3:13 PM

సాధారణంగా సినీ వారసులు హీరో హీరోయిన్లుగా అరంగేట్రం చేస్తారు. కానీ ప్రస్తుతం కొందరు స్టార్ కిడ్స్ ఈ సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తున్నారు. రవితేజ, సూర్య, విజయ్, షారుఖ్ ఖాన్ వంటి ప్రముఖ తారల వారసులు నటన కాకుండా దర్శకత్వ రంగం వైపు మొగ్గు చూపుతున్నారు. కొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తూ వెండితెరపై దర్శకులుగా పరిచయం అవుతున్నారు.

సాధారణంగా సినీ పరిశ్రమలో ప్రముఖులు తమ వారసులను కూడా ఇదే రంగంలోకి తీసుకురావాలని ఆకాంక్షిస్తారు. ముఖ్యంగా స్టార్ హోదా ఉన్న నటీనటులు, సాంకేతిక నిపుణులు తమ పిల్లలను హీరో, హీరోయిన్లుగానే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రణాళికలు రచిస్తారు. అయితే, ప్రస్తుతం కొంతమంది అగ్ర తారలు ఈ సంప్రదాయ నియమాన్ని పక్కనపెడుతున్నారు. మాస్ మహారాజ్ రవితేజ వారసుడు వెండితెర అరంగేట్రానికి సిద్ధమవుతున్నారు. బాలనటుడిగా ఇప్పటికే తన ప్రతిభను చాటుకున్న ఈ స్టార్ కిడ్ ప్రస్తుతం దర్శకత్వ విభాగంలో పనిచేస్తున్నారు. భవిష్యత్తులో దర్శకుడిగానే సిల్వర్ స్క్రీన్ రీ-ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

యాక్షన్‌ మోడ్‌లో గ్లామర్ క్వీన్స్‌.. రూటు మారుస్తున్న ఆ బ్యూటీస్ ఎవరు

దీపావళి బరిలోకి దూసుకెళ్తున్న సినిమాలు.. గెలుపు ఎవరిదో తెలుసా ??

ఇది యాపారం అంటున్న హీరోయిన్లు.. ముద్దుగుమ్మల మాస్ ప్లానింగ్ మామూలుగా లేదుగా

Sreeleela: హిందీలో బిజీ అవుతున్న తెలుగమ్మాయి.. ఏముందమ్మా అక్కడ..

Sharwanand: టర్న్ అవనున్న శర్వానంద్ టైమ్.. ఇక తగ్గేదేలే