Loading video

థియేటర్లో వెటకారంగా కుర్రాళ్ల డ్యాన్స్.. సాయి పల్లవి ఫ్యాన్స్‌ సీరియస్

|

Feb 18, 2025 | 11:31 AM

ఈ మధ్య కాలంలో సినిమా చూడడం కంటే.. ఆ సినిమా కెళ్లి మధ్యలో లేచి గంతులేయడం.. ఎక్స్‌ట్రాలు చేయడం ఎక్కువైంది. ఇలా తండేల్ మూవీలో కొందరు యువకులు చేసిన ఇలాంటి పనే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అయితే సాయి పల్లవి ఫ్యాన్స్‌ నుంచి మాత్రం సీరియస్ కామెంట్స్ వచ్చేలా చేసుకుంటోంది. సాయి పల్లవి, నాగ చైతన్య యాక్ట్ చేసిన లేటెస్ట్ ఫిల్మ్ తండేల్.

ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈసినిమా ఇప్పుడు సూపర్ డూపర్ హిట్టైంది. 100 కోట్ల కలెక్షన్స్‌ను కొల్లగొట్టేసింది. అయితే ఈ సినిమాలో ఓ సాంగ్‌లో సాయి పల్లవి నడుముతో చేసే ఒక హుక్ స్టెప్ ఉంది. ఆ స్టెప్ ఈ సినిమా రిలీజ్‌కు ముందు నుంచి నెట్టింట వైరల్ అవుతోంది. అందర్నీ ఆకట్టుకుంటూ రీల్స్‌ చేసేలా చేస్తోంది. అయితే ఈ హుక్‌ స్టెప్‌నే థియేటర్లో రీ క్రియేట్ చేయాలనుకన్న ఓ లురుగురు యువకులు.. అనుకున్నట్టుగానే చేసేశారు. స్క్రీన్‌ సై ఆ స్టెప్‌ వస్తున్న టైంలోనే.. థియేటర్లో లేచి నిలబడి.. సాయి పల్లవి స్టెప్‌ను అనుకరించారు. ఆ వీడియోను నెట్టింట వదిలారు. అయితే ఈ వీడియోను చూసిన సాయి పల్లవి ఫ్యాన్స్‌ ఫీలవుతున్నారు. సాయి పల్లవి డ్యాన్స్‌ను వెటకారం చేస్తున్నారంటూ సీరియస్ కామెంట్స్ చేయడం షురూ చేశారు. మరికొందరేమో ఈ కుర్రాళ్ల క్రేజీ పనిని ఫన్నీగా తీసుకుంటున్నారు. వారి డ్యాన్స్‌ అండ్ ఫన్ నేచర్‌ని మెచ్చుకుంటున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Samyuktha Menon: నేను ఆల్కహాల్ తాగుతాను.. మోహమాటం లేకుండా స్టేజ్‌పై చెప్పేసిన సంయుక్త

TOP 9 ET News: కన్ఫ్యూజన్‌లో రామ్ చరణ్‌, బుచ్చిబాబు | ‘చిరంజీవి తొందర పడాల్సిందే’