న్యూ ఇయర్ ట్రిప్‌కి పూజా, మాళవిక, మౌని రాయ్‌

Updated on: Dec 31, 2025 | 9:58 PM

నూతన సంవత్సర వేడుకల కోసం టాలీవుడ్, బాలీవుడ్ తారలు విదేశాలకు పయనమయ్యారు. మాళవిక మోహనన్, మౌని రాయ్, పూజా హెగ్డే వంటి ప్రముఖులు ఎయిర్‌పోర్ట్‌లో సందడి చేశారు. తమ అభిమానులకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలుపుతూ, వారి ప్రయాణాలకు సంబంధించిన వార్తలు, సినిమా అప్‌డేట్స్ ఆసక్తిని రేకెత్తించాయి. ఈ సెలబ్రిటీల న్యూ ఇయర్ గమ్యస్థానాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

నూతన సంవత్సర వేడుకలను విదేశాల్లో ఎంజాయ్‌ చేయడానికి టాలీవుడ్ బాలీవుడ్‌ స్టార్స్ ముంబై ఎయిర్‌పోర్ట్‌కు క్యూ కట్టారు. ఇంకొందరు తమ అభిమానులకు సోషల్ మీడియాలో న్యూ ఇయర్‌ విషెస్ పోస్ట్‌ చేస్తున్నారు. ‘ది రాజా సాబ్’లో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కిర్రాక్ లుక్‌లో కనిపించిన మాళవిక మోహనన్‌ న్యూ ఇయర్ సెలబ్రేషన్‌ కోసం విదేశాలకు వెళుతూ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. ది రాజా సాబ్‌లో ముగ్గురు హీరోయిన్లలో మాళవిక ఒకరు. నాగిని సీరియల్‌తో తెలుగు ఫ్యాన్స్‌ ఫాలోయింగ్ సంపాదించుకున్న మౌనీ రాయ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. న్యూ ఇయర్‌ కు విదేశాలకు చెక్కేస్తూ ఎయిర్‌పోర్ట్‌లో ఇలా దర్శనమిచ్చింది. బుట్ట బొమ్మ పూజా హెగ్డే, తలపతి విజయ్ తో చేసిన ‘జన నాయగన్’ పై గట్టి నమ్మకంతో ఉంది. విజయ్‌కు ఇది చివరి సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. తన నటనతో మెప్పించి సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోవాలని పూజా భావిస్తోంది. ‘దంగల్’లో బబితా కుమారి పాత్రలో అదరగొట్టిన సాన్యా మల్హోత్రా ఆ తర్వాత ‘బధాయ్ హో’, ‘ఫొటోగ్రాఫ్’ ‘లూడో లో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తన స్టైల్ తో ఇప్పటికే సోషల్ మీడియాలో ఫ్యాషన్ ఐకాన్‌గా పేరు తెచ్చుకుంది. స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కూలీలో ఆమిర్ ఖాన్‌ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఇప్పుడు ఆమిర్‌ తో మరో మూవీ తెరకెక్కించేందుకు లోకేశ్‌ రెడీ అవుతున్నారట. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ కావడంతో ఫ్యాన్స్ లో హైప్ పెరిగింది. సల్మాన్ భాయ్‌ ఎయిర్‌పోర్ట్‌లో సందడి చేసారు. ఆయన నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ సినిమాపై చైనా తీవ్ర విమర్శలు చేసింది. అయితే చైనా మీడియా చేస్తున్న విమర్శలను భారత్ కొట్టిపారేసింది. సినిమాలు తీసే స్వేచ్ఛ ఉందని.. నచ్చిన విధంగా సినిమాలు తీసుకోవచ్చని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దేశ ప్రజలకు కేంద్రం భారీ శుభవార్త..జనవరి 1 నుంచి

బంగారం కోసం ఇంటి ఓనర్‏ను చంపి గోదావరిలో పడేసిన యువకులు

30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు

ఫ్రీ బస్‌లో ఇక ఆధార్‌‌తో పనిలేదు మరి ఎలాగంటే..

రైలు పట్టాలపై నడవదు.. అయస్కాంత శక్తితో పరుగులు పెట్టే బుల్లెట్‌ ట్రైన్‌..