సౌత్ లో రీ ఎంట్రీకి రెడీ అవుతున్న శ్రద్ధా కపూర్

Updated on: Nov 21, 2025 | 6:36 PM

బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ దక్షిణాదికి రీ-ఎంట్రీ ఇవ్వనున్నారు. విజయ్ సేతుపతి హీరోగా మగిళ్ తిరుమేని దర్శకత్వంలో తెరకెక్కనున్న ద్విభాషా చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటిస్తున్నారు. సాహో తర్వాత ఇది ఆమె రెండో దక్షిణాది సినిమా, తొలి తమిళ సినిమా కానుంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది.

బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ దక్షిణాది ప్రేక్షకులను మళ్లీ పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. సాహో వంటి పాన్ ఇండియా సినిమాతో ఇప్పటికే సౌత్ లో తన పరిచయాన్ని పెంచుకున్న శ్రద్ధా, తన రీ-ఎంట్రీ కోసం ఒక విభిన్నమైన చిత్రాన్ని ఎంచుకున్నారు. తన కెరీర్ ప్రారంభం నుండి సొంత గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్న శ్రద్ధా కపూర్, గ్లామర్‌తో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ జాతీయ స్థాయిలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా నిలిచారు. ఆషికి 2తో గుర్తింపు తెచ్చుకొని, సాహోతో పాన్ ఇండియా స్టార్‌గా మారారు. ఇటీవలే స్త్రీ 2తో లేడీ ఓరియెంటెడ్ జోన్రాలో కూడా తనదైన ముద్ర వేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sai Pallavi: మళ్లీ సౌత్ మీద దృష్టి పెట్టిన రౌడీ బేబి

Rasha Thadani: బాలీవుడ్ నయా సెన్సేషన్ రాషా తడాని

నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చిన రిషబ్ శెట్టి.. అంతకు మించి అనేలా ఉండబోతుందా ??

ఏపీ నుంచి ఆఫ్రికా వరకు విస్తరించిన ఐబొమ్మ రవి నెట్ వర్క్

Raju Weds Rambai: క్లైమాక్స్‌ కనెక్ట్ అయితే ఈ సినిమా మీకు నచ్చినట్టే