Payal Ghosh-NTR: ఎన్టీఆర్ పై క్రేజీ కామెంట్స్‌ చేసిన బాలీవుడ్ హీరోయిన్… బాలీవుడ్‌లో కూడా పెరుగుతోన్న తారక్ క్రేజ్‌

|

Feb 24, 2022 | 8:42 AM

NTR: టాలీవుడ్‌లో ఎన్టీఆర్‌కు ఎలాంటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీనియర్‌ ఎన్టీఆర్‌గా పేరు ప్రఖ్యాతలు ఉన్నా తన సొంత ప్రతిభతో వెండితెరపై టాప్‌ హీరోగా మారారు జూనియర్‌. తన అద్భుత నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఎన్టీఆర్‌

NTR: టాలీవుడ్‌లో ఎన్టీఆర్‌కు ఎలాంటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీనియర్‌ ఎన్టీఆర్‌గా పేరు ప్రఖ్యాతలు ఉన్నా తన సొంత ప్రతిభతో వెండితెరపై టాప్‌ హీరోగా మారారు జూనియర్‌. తన అద్భుత నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఎన్టీఆర్‌ ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ సినిమా ఇంకా విడుదల కూడా కాకముందే బాలీవుడ్‌లో ఎన్టీఆర్‌కు ఫుల్‌ క్రేజ్‌ పెరుగుతోంది. బాలీవుడ్‌ నటీమణులు ఎన్టీఆర్‌తో నటించడానికి ఆసక్తి చూపిస్తుండడమే ఇందుకు కారణం. ఇటీవల బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొణె జూనియర్‌తో నటించే అవకాశం వస్తే వదులుకోనని చెప్పిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఈ జాబితాలోకి మరో హీరోయిన్‌ వచ్చి చేరింది.

ఊసరవెల్లి సినిమాలో తమన్నా ఫ్రెండ్‌గా నటించిన నటి పాయల్‌ ఘోష్‌ తాజాగా ట్విట్టర్‌ వేదికగా చేసిన ఓ పోస్ట్‌ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీపికా ఎన్టీఆర్‌తో నటించాలని ఉందని తెలిపడంపై స్పందించిన పాయల్‌.. ‘ఎన్టీఆర్‌తో కలిసి పనిచేసేందుకు బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌ పోటీపడుతున్నారు. నేను ఇప్పటికే ఊసరవెల్లిలో తారక్‌తో కలిసి నటించినందుకు నాకు చాలా సంతోషం, గర్వంగా ఉంది. ఊసరవెల్లి సినిమా గురించి బాలీవుడ్‌లో కూడా మాట్లాడుకుంటారని నేను 2020లో చెప్పాను. కానీ అప్పుడు చాలా మంది నన్ను విమర్శించారు. ఇప్పుడు మళ్లీ చెబుతున్నా.. త్వరలోనే సౌత్‌ ఇండియా ఫిలిమ్‌ ఇండస్ట్రీ బాలీవుడ్‌ను కైవసం చేసుకోనుంది. నా మాట ఎప్పిటికీ తప్పదు’ అని వ్యాఖ్యానించింది.

మరిన్ని చూడండి ఇక్కడ: