కేజీఎఫ్ 2 సినిమాలో పవర్ ఫుల్ ‘రమిక’ పాత్రలో నటించిన బాలీవుడ్ స్టార్ నటి రవీనా టాండన్ వివాదంలో చిక్కుకుంది. జూన్ ఒకటి రాత్రి రవీనా టాండన్ ప్రయాణిస్తున్న కారు ముగ్గురు మహిళలకు తాకుకుంటూ వెళ్లింది. ఈ ఘటనలో ఆ ముగ్గురు మహిళలు గాయాలపాలయ్యారు. ఈక్రమంలోనే ఆ ముగ్గురు బాధితులు వారి కుంటుంబ సభ్యులు రవీనా కారును ఆపి ఆమెతో గొడవకు దిగారు. రవీనాతో పాటు.. ర్యాష్‌గా కార్ నడిపిన రవీనా డ్రైవర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అంతేకాదు ఆ వీడియోలో.. రవీనా తనను కొట్టొద్దంటూ.. తనను చుట్టు ముట్టిన వాళ్లను వేడుకోవడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఈ ఘటనపై తాజాగా ముంబై జోన్ 9 డీసీపీ రాజ్ తిలక్ రోషన్ మాట్లాడారు. ఈ ఘటనపై ఆయన ఓ అప్‌డేట్ ఇచ్చారు. తమపై దాడి జరిగిందని రవీనా గానీ.. గొడవ చేసిన వారు కానీ ఫిర్యాదు చేయలేదన్నారు. కాబట్టి కేసు ఏం లేదని తేల్చి చెప్పారు. అంతేకాదు ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని రాజ్ తిలక్ మీడియాతో వివరించారు. రవీనా డ్రైవర్ కారు నడిపాడని.. కానీ కొందరు రవీనాను కావాలనే ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారని రవీనాను వెనకేసుకొచ్చారు డీసీ. అంతేకాదు ఆ సమయంలో రవీనా మద్యం తాగిలేదని కూడా చెప్పాడు ఆయన. ఇక దీని పై రవీనా కూడా ఇన్ డైరెక్ట్ గా రెస్పాండ్ అయ్యింది. ఆమె ఇన్ స్టా స్టోరీలో తనపై వచ్చిన ఫేక్ న్యూస్‌లను అలాగే తన పై వచ్చిన రియల్ న్యూస్‌ను షేర్ చేసింది. అక్కడ ప్రమాదం జరగలేదని, తాను మద్యం తగలేదని ఇన్ డైరెక్ట్ క్లారిటీ ఇచ్చింది. అయితే రవీనా ఇష్యూపై సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ పేలుతున్నాయి. వీడియోలో ఏడ్చి రచ్చ చేసిందని.. పోలీసోళ్లను తింగరోళ్లను చేసిందనే అర్థం వచ్చేలా ఈమెపై పంచులు పేలుతున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏనుగమ్మా ఏనుగు.. మా ఊరు రావద్దు ఏనుగు
గుడ్ న్యూస్.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే ??
తాటి చెట్ల మధ్య ఇరుక్కున్న గేదె.. ఎలా బయటకి తీశారంటే ??
TOP 9 ET News: గుడ్ న్యూస్ !! కల్కి ట్రైలర్ డేట్ ఫిక్స్.. | డ్రగ్ పార్టీకి నిర్వహణలో హేమ కీ రోల్