రోహిణీ పంట పండింది.. బిగ్ బాస్ నుంచి భారీగా రెమ్యునరేషన్ !!
బిగ్‌బాస్ 8వ సీజన్ చివరకొచ్చేసింది. మరో వారంలో ఈ షో ముగియనుంది. ఇక వచ్చేవారమంతా హౌస్ లో ఫినాలే వీక్ జరగనుంది. ఈ క్రమంలోనే ఫైనల్ ఫైవ్‌ను సెలక్ట్ చేసే పని మొదలెట్టిన బిగ్ బాస్ .. డబుల్ ఎలిమినేషన్స్‌తో.. రోహిణికి ఝలక్ ఇచ్చాడు. ఓటింగ్ ద్వారా ప్రజలు ఇచ్చినత తీర్పు మేరకు ఎలిమినేట్ అంటూ ప్రకటించాడు.
ఇక టాప్-5 కచ్చితంగా ఉంటుందనుకున్న రోహిణీ అనూహ్యంగా బయటకు రావడం ఆమె అభిమానులను నిరాశకు గురి చేసింది. అయితే ఫినాలేలో అడుగుపెట్టనప్పటికీ తన ఆట, మాట తీరుతో అందరి మనసులు గెల్చుకుంది రోహిణి. అంతేకాదు కళ్లు చెదిరే రెమ్యునరేషన్ ను కూడా అందుకుంది. గతంలోనే బిగ్ బాస్ మెయిన్ కంటెస్టెంట్ గా వచ్చిన రోహిణీ ఎనిమిదో సీజన్ లో మాత్రం వైల్డ్ కార్డ్ తో ఎంట్రీ ఇచ్చింది. అయితేనేం హౌస్ లో ప్రధాన కంటెస్టెంట్స్ కంటే తానే చాలా బెటర్ అనిపించుకుంది. ఓ వైపు కామెడీతో కడుపుబ్బా నవ్విస్తూనే ఫిజికల్ టాస్కుల్లోనూ సత్తా చాటింది. ఓటింగ్ లోనూ సత్తా చాటింది. ఈ క్రమంలోనే ఫైనల్ ఫైవ్ ముందే ఎలిమినేట్ అయింది. ఇక బిగ్ బాస్ 8వ సీజన్‌లో రోహిణి దాదాపు 9 వారాల పాటు ఉంది. హౌసులోకి వచ్చేముందే వారానికి 2లక్షల చొప్పున బిగ్ బాస్ నిర్వాహకులతో ఆమె ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఆమె సుమారు 18 లక్షల వరకు పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సీరియల్ నటితో రెండో పెళ్లి.. 46 ఏళ్ల వయసులో సాయి కిరణ్ లవ్‌స్టోరీ !!
Siddu Jonnalagadda: మొత్తానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న టిల్లు సాబ్ !!
విష్ణుకు అర కోటి రెమ్యునరేషన్.. విన్నర్ అయినా ఇంత రాదేమో
బీరకాయా.. అని తీసిపారేయకండి.. అసలు విషయం తెలిస్తే వదిలిపెట్టరు
వామ్మో.. ఒంగోలులో దెయ్యమట !! జుట్టు విరబోసుకుని.. ఏడుస్తూ..